మీడియా ముందు మాటల యుద్ధానికి దిగిన అమెరికా చైనా మంత్రులు
చైనాలో పర్యటిస్తున్న అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపే అన్ని అంశాలపై అమెరికా వైఖరిని చైనా విదేశాంగ మంత్రి వాంగా ఈకి కుండ బద్దలు కొట్టినట్లు తెలిపారు. ఏదీ దాచకుండా చాలా స్పష్టంగా అన్ని విషయాలు చెప్పారు మైక్. ప్రస్తుతం అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే మైక్ చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లు సైతం నిరాశజనకంగా మారాయి. అంతేకాదు దీనితో పాటు ఇరు దేశాలకు ఉత్తరకొరియా తైవాన్ అంశాలు కూడా కొరకరాని కొయ్యగా మారాయి.
సమావేశం తర్వాత మైక్, వాంగ్ ఈ సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే మాటల యుద్ధం ఇరు నేతల మధ్య కనిపించింది. సంయుక్త సమావేశంలో మొదటగా మాట్లాడారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ. అమెరికా వాణిజ్యపరంగా చైనాపై యుద్ధం ప్రకటిస్తుండటం సహించలేమని అన్నారు. అంతేకాదు తైవాన్ అంశంలో కూడా అమెరికా జోక్య చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పు బడుతున్నట్లు వాంగ్ ఈ పేర్కొన్నారు. చైనా హక్కులను, ఆసక్తులను కాలరాసేలా తైవాన్ వ్యవహరిస్తోందని... దీనికి అమెరికా వంత పాడటం బాగోలేదని వాంగ్ ఈ అన్నారు. ఇకనైనా ఈ వ్యవహారానికి అమెరికా చెక్ పెడుతుందని భావిస్తున్నట్లు చైనా కోరింది.

ఇక మైక్ వంతు వచ్చినప్పుడు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. చైనా లేవనెత్తిన అంశాలపై ప్రాథమిక అసమ్మతి ఉందని మైక్ చెప్పారు. చైనాతో తీసుకున్న చర్యలపై అమెరికా దృష్టి సారించినట్లు మైక్ తెలిపారు. అయితే ప్రతి అంశంపై కూలంకుషంగా చైనాతా చర్చించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని మైక్ వెల్లడించారు. అంతేకాదు ఉత్తరకొరియా పూర్తిగా అణ్వాయుధాల తయారీకి స్వస్తి చెప్పేలా చైనా ఒత్తిడి తీసుకొస్తే బాగుంటుందని అమెరికా అభిప్రాయపడింది. మరోవైపు చైనా అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని వాంగ్ ఈ తప్పుబట్టారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications