కెనడాని వణికిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు..

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కెనడాకి దడ పుట్టిస్తున్నారు. తమవద్ద బందీలుగా ఉన్న నలుగురిలో కెనడాకి చెందిన వ్యక్తిని ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. జాన్ రిడ్స్‌డెల్‌ అనే ఆ వ్యక్తిని ఉగ్రవాదులు హత్య చేసినట్టుగా కెనడా ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఫిలిప్పైన్స్‌లోని అబు సయ్యఫ్ ఉగ్రవాదులు జాన్ రిడ్స్‌డెల్‌ కు శిరశ్ఛేదం చేసినట్లుగా కెనడా ప్రభుత్వం తెలియజేసింది.

దీనికి ఆధారంగా.. జోలో ద్వీపంలో రిడ్స్‌డెల్ తల దొరికిందని ఫిలిప్పైన్స్ సైనికాధికారులు ప్రకటించారు. ముందుగా తమ వద్ద బందీలుగా ఉన్న నలుగురు వ్యక్తులను విడుదల చేయడం కోసం భారీ మొత్తంలో డబ్బు చెల్లించాలని డిమాండ్ చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు.. ఇచ్చిన గడువు పూర్తవడంతో బందీల్లో ఒకరిగా ఉన్న రిడ్స్‌డెల్‌ను హతం చేశారు. డబ్బులు డిమాండ్ చేసిన కేవలం అయిదు గంటల వ్యవధిలోనే ఉగ్రవాదులు ఈ చర్యకు పూనుకున్నారు.

Militants kill Canadian hostage John Ridsdel in the Philippines

ఉగ్రవాదులు బంధీలుగా పట్టుకున్న నలుగురిలో ఇద్దరు కెనడాకు చెందినవారు కాగా.. ఒకరు నార్వేజియన్ కి చెందిన పురుషుడు, మరొకరు ఫిలిప్పీన్స్‌కు చెందిన మహిళ. ఉగ్రవాదుల పట్ల చర్యలు తీసుకోవాలని బాధిత వ్యక్తుల కుటుంబాలు అక్కడి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాయి. ఇదిలా ఉంటే హత్య చేసిన తర్వాత రిడ్స్‌డెల్ తలను ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌ లో తీసుకొచ్చి జోలో పట్టణంలో పడేసి వెళ్ళినట్లుగా అక్కడి కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారని సైనికాధికారులు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+