ట్రంప్‌కు జింగ్‌పిన్ ఫోన్, ఉ.కొరియాపై అగ్రదేశాల వ్యూహమిదే!
వాషింగ్టన్: ఉత్తరకొరియాపై అమెరికా ఇప్పటికిప్పుడే సైనిక చర్యకు దిగే అవకాశాలు కన్పించడం లేదు.దీంతో ఆచితూచి వ్యవహరించాలని అమెరికా భావిస్తోంది. ఉత్తరకొరియా అణు పరీక్షల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్ ఫోన్‌లో చర్చించారు.
ఉత్తరకొరియాను కట్టడి చేసేందుకుగాను అమెరికా అనేక రకాల వ్యూహలను రచిస్తోంది. కానీ, అమెరికా వ్యూహలను తిప్పికొట్టేలా ఉత్తరకొరియా వ్యవహరిస్తోంది.
దక్షిణ కొరియాను బలోపేతం చేయడంతో పాటు తమ దేశంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని ఉత్తరకొరియా డిమాండ్ చేస్తోంది.
ఈ తరుణంలో తమ సత్తాను ప్రపంచదేశాలను చూపాలని ఉత్తరకొరియా భావిస్తోంది. ఇందులో భాగంగానే అణుపరీక్షలను ఉత్తరకొరియా నిర్వహిస్తోంది. ఉత్తరకొరియా తీరుపై ఐక్యరాజ్యసమతిసహ పలు దేశాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

ట్రంప్‌కు ఫోన్ చేసిన చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్
చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుదవారం నాడు ఫోన్ చేశారు. సైనిక చర్య విషయమై చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రశ్నించారు. అయితే ఉత్తరకొరియాపై సైనిక చర్యకు దిగడం తమ అభిమతం కాదన్నారు ట్రంప్, చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్ కూడ ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కిమ్‌ను అడ్డుకోవాలి
ఉత్తరకొరియాలో ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్ అభిప్రాయపడ్డారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ వ్యవహరాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్ తనతో చెప్పారని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

పరిస్థితులు విషమిస్తే సైనిక చర్య
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ అతిగా వ్యవహరించి ఇతర దేశాల సార్వభౌమాత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోకూడదని అమెరికా, చైనా దేశాల అధ్యక్షులు అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా అగ్రదేశాలన్నీ ఏకమై ఉత్తరకొరియా అణుపరీక్షల అంశంలో జోక్యం చేసుకోవాలని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ అంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు.

ఉత్తరకొయాతో సంబంధాలున్న దేశాలపై ఆంక్షలు
ఉత్తర కొరియా దుందుడుకు చర్యలతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్న ట్రంప్ తాజాగా మరో అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. ఉత్తరకొరియాతో సంబంధాలున్న దేశాలపై ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కొరియా అణు పరీక్షలపై ఐక్యరాజ్య సమితి అదనపు ఆంక్షలు విధించకుంటే తామే ఆ పని చేస్తామని అమెరికా ట్రెజరీ కార్యదర్శ స్టీవ్ ఎంనుచిన్ చెప్పారు. ప్యోంగ్యాంగ్‌తో సంబంధాలున్న ప్రతి దేశంపైనా ఆంక్షలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సిద్ధంగా ఉందని, ట్రంప్ సంతకం చేయడానికి సిద్దంగా ఉన్నారని చెప్పారు.
-
యుద్ధంలోకి అమెరికా నేవీ.. హార్మూజ్ జలసంధి అష్టదిగ్బంధనం.. ట్రంప్ సంచలన వార్నింగ్ -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్










Click it and Unblock the Notifications