నియంత కిమ్‌జొంగ్ ప్రయత్నాలు సముద్రంపాలు: బెడిసికొట్టిన ప్రయోగం

ప్యాంగ్యాంగ్: ఆధునిక నియంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జొంగ్ ఉన్.. గూఢచర్య ప్రయత్నాలు సముద్రంపాలయ్యాయి. రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా పేరు తెచ్చుకున్న ఉత్తర కొరియా చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం ఘోరంగా విఫలమైంది. నింగిలోకి ప్రయోగించిన ఉపగ్రహం ఎల్లో సముద్రంలో కుప్పకూలింది.

అగ్రరాజ్యం అమెరికా, దాయాది దేశం దక్షిణ కొరియా, పొరుగునే ఉన్న జపాన్‌ సహా.. ఇతర ఆసియా దేశాలకు కంటి మీద కునుకు లేకుండా, ఆత్మరక్షణలోకి నెట్టేలా అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలతో గడగడలాడించిన కిమ్ జొంగ్- అంతరిక్షంపైనా ఆధిపత్యాన్ని చలాయించడానికి చేసిన ప్రయత్నం అది. అత్యాధునిక మిలటరీ గూఢచర్య ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు మంగళవారమే సెంట్రల్ మిలటరీ కమిషన్ ఉపాధ్యక్షుడు రి ప్యొంగ్ చోల్‌ ప్రకటించారు.

Military spy satellite launched by North Korea, crashes into Yellow Sea

ఈ తెల్లవారు జామున దీన్ని ప్రయోగించారు. మల్లిగ్‌ యాంగ్-1 పేరుతో ఈ స్పై శాటిలైట్‌ రూపొందింది. చోల్లిమా-1 అనే రాకెట్- ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. తీర ప్రాంత నగరంలో నిర్మించిన రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి ఉత్తర కొరియా కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున 6:27 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది ఈ రాకెట్. కొద్దిసేపటికే విఫలమైంది. ఎల్లో సముద్రంలో కుప్పకూలింది.

ఈ రాకెట్ ప్రయోగం విఫలమైన విషయాన్ని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. తొలిదశ విజయవంతమైనప్పటికీ- మలిదశలో అంటే రాకెట్ నుంచి శాటిలైట్ విడిపడే దశలో సాంకేతిక లోపాలు తలెత్తాయని వివరించింది. మలిదశలో ఏర్పడిన సాంకేతిక లోపాల వల్ల ప్రయోగం విఫలమైందని పేర్కొంది. రాకెట్, ఉపగ్రహ శకలాలు ఎల్లో సముద్రంలో కూలిపోయినట్లు స్పష్టం చేసింది.

ఈ రాకెట్‌ను ప్రయోగించడానికి కొత్త తరహా ఇంజిన్‌ను వినియోగించినట్లు వర్కర్స్ పార్టీ సెంట్రల్ మిలటరీ కమిషన్ తెలిపింది. ఈ లోపాలను పునఃసమీక్షించుకుంటామని, త్వరలోనే మళ్లీ దీన్ని ప్రయోగిస్తామని సెంట్రల్ మిలటరీ కమిషన్ ఉపాధ్యక్షుడు రి ప్యొంగ్ చోల్‌‌ను ఉటంకించింది కేసీఎన్ఏ. అమెరికాతో కలిసి దక్షిణ కొరియా ఆర్మీ డ్రిల్స్‌ను నిర్వహించడాన్ని ఉత్తరకొరియా వ్యతిరేకిస్తోంది. ఈ కారణంతోనే ఈ రెండు దేశాలతో జపాన్ సైనిక రహస్యాలను పసిగట్టడానికి ఈ స్పై శాటిలైట్ ప్రయోగానికి పూనుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+