విదేశీయుల పట్ల ట్రంప్ కఠిన రూల్స్: బ్రేక్ చేస్తే అమెరికా నుంచి అవుట్..
కొత్త నిబంధనల చేర్పుతో అక్రమ వలసదారులను, నిబంధనలు పాటించని విదేశీయులను వెనక్కి పంపించడానికి డీహెచ్ఎస్ పని సులువవుతుంది.
వాషింగ్టన్: ఇప్పటికే ఏడు ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గిన ట్రంప్.. అమెరికాలో విదేశీయులకు ఎలాగైనా చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు అమెరికాలోని ప్రతీ చట్టాన్ని విదేశీయుల పట్ల మరింత కఠినతరం చేసేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తాజాగా ట్రాఫిక్ రూల్స్ ను మరింత కఠినతరం చేస్తూ కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీని రూపొందించారు. కొత్త పాలసీకి సంబంధించిన పత్రాలపై సెక్రటరీ జాన్ కెల్లీ సంతకాలు కూడా పూర్తయిపోయాయి. ఈ విషయాన్ని హోం ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్(డీహెచ్ఎస్) ప్రకటించింది.
కొత్త పాలసీ ప్రకారం అక్రమంగా వలస వచ్చే విదేశీయులను, చిన్న చిన్న తప్పుల్లో దొరికినవారిని కూడా అమెరికా అవతలికి పంపించనున్నారు. కాగా, గత ఒబామా ప్రభుత్వం విదేశీయులను గడపదాటించేందుకు కేవలం రెండు తప్పులు మాత్రమే పరిగణలోకి తీసుకునేది.

అందులో ఒకటి వీసా గడువు పూర్తయినా అమెరికాలోనే నివసించడం.. మరొకటి అనుమతి లేకుండా బోర్డర్ క్రాస్ చేసి అమెరికాలోకి అడుగుపెట్టడం. ట్రంప్ ప్రభుత్వం మాత్రం నేరచరిత్ర కలిగిన విదేశీయులను ఇక ఏమాత్రం ఉపేక్షించేది లేదంటోంది. వారిని దేశభద్రతకు పరిణమించిన ముప్పుగా పరిగణించాలని నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వారందరిని ఇప్పుడు అమెరికా గడప దాటించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీలోని నిబంధనలు:
*కొత్త పాలసీతో అమెరికాలో నివసిస్తున్న సుమారు మూడు లక్షల మందికి పైగా భారతీయులపై ఇది ప్రభావం చూపనుంది.
*వలసదారుల కేసులు కోర్టుల పరిధిలో ఉన్నా వారిని నిర్బంధించడానికి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ కు వారిని నిర్బంధించే అవకాశం ఉంది. ఒకవేళ సదరు వ్యక్తులు మెక్సికోకు చెందినవారైతే తక్షణం వెనక్కి పంపిస్తారు.
*కొత్త నిబంధనల చేర్పుతో అక్రమ వలసదారులను, నిబంధనలు పాటించని విదేశీయులను వెనక్కి పంపించడానికి డీహెచ్ఎస్ పని సులువవుతుంది.
*మెక్సికో నుంచి అమెరికాలో ప్రవేశించినవారిని తిరిగి మెక్సికో పంపించాలని తాజా పాలసీలో పేర్కొన్నారు.
*యూఎస్ ఇమిగ్రేషన్ లో కొత్తగా 10వేల ఉద్యోగాలు, యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్స్ లో 5వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications