వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వావ్.. ఫెంటాస్టిక్.. మైండ్‌ బ్లోయింగ్‌, దీని గురించి ఎంత చెప్పినా తక్కువే మరి!

వావ్.. ఫెంటాస్టిక్.. మైండ్‌ బ్లోయింగ్‌.. ఇలాంటి మాటలేవీ సరిపోవేమో అనిపిస్తోంది దీన్ని చూస్తుంటే. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చూసే మనం అబ్బురపడిపోతుంటాం. అలాంటిది.. ఈ ప్రాజెక్టు గురించి వింటుంటే..

|
Google Oneindia TeluguNews

బీజింగ్: న్యూఢిల్లీ: వావ్.. ఫెంటాస్టిక్.. మైండ్‌ బ్లోయింగ్‌.. ఇలాంటి మాటలేవీ సరిపోవేమో అనిపిస్తోంది దీన్ని చూస్తుంటే. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చూసే మనం అబ్బురపడిపోతుంటాం. అలాంటిది.. ఈ ప్రాజెక్టు గురించి వింటుంటే.. కళ్లారా చూస్తుంటే.. ఏమైపోతామో?

సాధారణంగా రెండు, మూడు వరుసల రోడ్లు నాలుగు దిక్కులకు చీలిపోయే కూడలిలో ఏ దిక్కుకు పోవాలో తెలియక వాహనదారులు తికమక పడడం మనం చూస్తూనే ఉంటాం. మరి, 20 ర్యాంపులు (కిందకు దిగే రోడ్లు) కలిగిన ఐదు వరుసల రోడ్లు ఎనిమిది దిక్కులుగా చీలిపోయే సెంటర్‌ను చూస్తే ఎలాగుంటుంది? కళ్లు తిరిగి గుడ్లు తేలేయడం ఖాయమంటారా? అలాంటి అత్యంత క్లిష్టమైన హుయాంగ్ జాంగ్ వాన్ కూడలిని చైనాలోని చాంకింగ్‌ నగరంలో నిర్మించారు.

huangjuewan-overpass

2009లో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టును రెండు రోజుల క్రితం, అంటే మే 31వ తేదీన చైనా పూర్తి చేసింది. దీనిపై ట్రయల్‌ రన్‌ నిర్వహించినప్పటికీ దీన్ని ఇప్పడే ప్రారంభించడం లేదని, వచ్చే ఏడాది ప్రారంభించాలనుకుంటున్నట్లు చైనా అధికారులు తెలిపారు.

నగరంలో ఓ ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను పూర్తి చేయాల్సిన పని ఉందని, అది పూర్తయ్యాక ఈ భారీ ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సంక్లిష్ట రోడ్ల కూడలిపై చైనా సోషల్‌ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

చైనా సాంకేతిక పరిజ్ఞానానికి జోహార్లని కొందరంటే, అత్యద్భుతమని మరికొందరన్నారు. అసలు ఈ కూడలి దాటి సరైనా దారిలో వెళ్లేదెలా? అని ఇంకొందరు ప్రశ్నిస్తే.. అన్నికళ్లు తెరచుకొని వాహనం నడపాలని వారికి మరికొందరు సూచిస్తున్నారు.

అయితే చైనా అధికారులు మాత్రం రోడ్లపై ఏర్పాటు చేసిన గుర్తులను పట్టుకొని వెళితే సరైన రూట్‌లో వెళ్లడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు. ఒకవేళ దారి తప్పినా ఐదారొందలు, గరిష్టంగా కిలోమీటరుకు మించి దూరం వెళ్లకుండానే సరైన దారిలోకి రావచ్చని వారు చెబుతున్నారు.

English summary
The ‘mind-blowing’ overpass in Chongqing, China, is very much a reality after it was completed earlier this week. The new interchange has left people confused and some concerned about getting lost in the city’s complicated road layout. The Huangjuewan Overpass, which began being constructed in 2009, features five layers, 20 ramps and eight directions. But an official in charge of the project insists it’s really easy to get around using the signs. He told People’s Daily Online: ‘Even if you take the wrong way, then you only have to go around one kilometre or even just five or six hundred metres before there is an option to correct the wrong turn.’
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X