మినీ స్కర్టులో ఆమె!: 6సెకన్ల ఆ వీడియోపై భగ్గుమన్న సౌదీ..
6సెకన్ల వీడియో ఒకటి ఇంటర్నెట్ లో లీక్ అవడంతో.. ఆమెను పట్టుకుని శిక్షించే పనిలో అక్కడి అధికారులు నిమగ్నమయ్యారు.
రియాధ్: సాంప్రదాయంతో పేరుతో సౌదీ అరేబియాలో మహిళలపై ఉండే ఆంక్షలు అన్నీ ఇన్నీ కావు. మహిళలు హిజాబ్, బురఖా లేకుండా బయటకు రావడం అక్కడ నిషిద్దం. ఒకవేళ ఈ చర్యలెవరైనా ఉల్లంఘిస్తే వారికి కఠిన శిక్షలు తప్పవు.
తాజాగా సౌదీకి చెందిన ఓ మహిళ.. బురఖా ధరించకుండా అక్కడ వీధుల్లో తిరిగింది. దీనికి సంబంధించిన 6సెకన్ల వీడియో ఒకటి ఇంటర్నెట్ లో లీక్ అవడంతో.. ఆమెను పట్టుకుని శిక్షించే పనిలో అక్కడి అధికారులు నిమగ్నమయ్యారు.

సౌదీ రాజధాని రియాధ్‌కు 95 మైళ్ల దూరంలో ప్రముఖ సందర్శన స్థలమయిన ఉషాయ్‌కిర్ దగ్గర ఉండే నజ్డ్ అనే గ్రామంలో ఆ యువతి సంచరించినట్లు గుర్తించారు. వీకెండ్‌లలో ఎవరూ లేని సమయంలో అక్కడకు వెళ్లిన యువతి.. బురఖాలో కాకుండా మోడర్న్ డ్రెస్ లో అక్కడ కలియతిరిగింది. ఆ సమయంలో తీసుకున్న వీడియోలు బయటకు పొక్కాయి. వీడియోలో యువతి స్కర్ట్ ధరించినట్లు కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో పాపులర్ యూజర్ అయిన ఖులూడ్ ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో సౌదీలో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ధరించిన దుస్తులపై వారు మండిపడుతున్నారు. కాగా, సౌదీకి వచ్చే విదేశీయులకు మాత్రం దుస్తుల విషయంలో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. సౌదీ సాంప్రదాయాలను గౌరవిస్తూ అసభ్యకరంగా లేని దుస్తులను విదేశీయులు ధరించవచ్చు.












Click it and Unblock the Notifications