గర్ల్‌ప్రెండ్‌ను రేప్ చేశాడని స్నేహితుడి తల నరికేశాడు
మిన్నిసోతా: జూన్ 24, అర్ధరాత్రి సమయం. మిన్నిసోతా పట్టణంలోని డీర్ నది సమీపంలో అనుమానాస్పద లైసెన్స్ నెంబర్ ప్లేట్‌ను కలిగి ఉన్న కారు ఆగి ఉంది. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి ఆ కారు వద్దకు వెళ్లారు. పోలీసులను చూసిన కారులో ఉన్న వ్యక్తులు కారు వేగాన్ని పెంచారు.
అయితే పోలీసులు ఇంతలో వారిని అందుకునే ప్రయత్నం చేయగా గంటకు 100 మైళ్ల వేగంతో కారును పోనిచ్చారు. అలా అతివేగంతో దూసుకెళ్లిన కారు కొద్దిదూరం వెళ్లిన తర్వాత చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. వెంటనే కారు డ్రైవర్ అందులో నుంచి పారిపోయి సమీపంలోని ఓ ఇంట్లో దాక్కున్నాడు.
అదే సమయంలో కారులో ఉన్న మరో వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించిన జోసెఫ్ క్రిస్టెన్ థార్సెన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సమీపంలోని పాడుబడ్డ ఇంట్లో దాక్కున్న డ్రైవర్‌ను బయటకు లాక్కొచ్చారు. అనంతరం డ్రైవర్ చెప్పిన మాటలతో పోలీసులు కంగుతిన్నారు.
థార్సెన్ తన స్నేహితుడైన డేవిడ్ అలెగ్జాండర్ హైమన్ అనే వ్యక్తిని కిరాతకంగా పొడిచి చంపి అనంతరం అతడి తల నరికేసి సమీపంలోని అడవుల్లోకి విసిరిపారేశాడు. తాను ఎంతగానో ప్రేమించిన తన గర్ల్ ప్రెండ్‌పై అత్యాచారానికి పాల్పడ్డారనే కారణంతోనే అతడిని హత్య చేశాడని పోలీసులు ముందు నిజాన్ని వెల్లడించాడు.

వివరాల్లోకి వెళితే... డ్రగ్స్‌కు అలవాటుపడిన థార్సెన్ గతంలో రెండు మూడు నేరాలకు గాను జైలు శిక్షను అనుభవించాడు. ఈ క్రమంలో 35 ఏళ్ల థార్సెన్‌కు హైమన్(21)కు ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ స్నేహితులయ్యారు. థార్సెన్‌కు ఒక గర్ల్ ప్రెండ్ ఉంది. ఈ విషయాన్ని తన స్నేహితుడైన హైమన్‌కు చెప్పాడు.
అయితే ఒకరోజు థార్సెన్ గర్ల్ ప్రెండ్ వద్దకు వెళ్లిన హైమన్ ఆమెపై లైంగికదాడి చేశాడు. అలా ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన సమయంలో అతడిపై ఆమె తిరగబడింది. తన గర్ల్ ప్రెండ్‌పై అత్యాచారానికి పాల్పడిన హైమన్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలని థార్సెన్ నిర్ణయించుకున్నాడు.
మత్తు పదార్థాలకు అలవాటు పడిన ఈ ముగ్గురు ఒకరోజు మరో కారు డ్రైవర్‌తో కలిసి కారులో వెళుతున్నారు. కారు చెకింగ్ కోసం అని హైమన్ కిందికి దిగగా వెనుక నుంచి థార్సెన్ బలంగా బేస్ బాల్ బ్యాట్‌తో దాడి చేశాడు. అతడిని కత్తితో కసితీరా పొడిచి చంపాడు. అనంతరం అతడి తల నరికేసి అడవిలో పారేశాడు.
అనుమానంతో కారును వెంబడించిన పోలీసులకు ఈ హత్య ఉదంతాన్ని తెలుసుకుని కంగుతున్నారు. అనంతరం థార్సన్‌ను అతడి గర్ల్ ఫ్రెండ్‌తో పాటు మరో కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications