అమెరికాలో మోడీ కోసం భారీ రిసెప్షన్, హోస్ట్‌గా నీనా

వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనను ఒబామా సర్కారుతో పాటు, అక్కడి భారతీయ వర్గాలు కూడా ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్నాయి. ఆయన కోసం అమెరికాలోని భారతీయులు ఓ భారీ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హోస్టులు గా 'మిస్ అమెరికా 2014' నీనా దావులూరి, అమెరికాలో సుప్రసిద్ధ టీవీ యాంకర్ హరి శ్రీనివాసన్ (పీబీఎస్ చానల్) వ్యవహరించనున్నారు.

న్యూయార్క్‌లోని సుప్రసిద్ధ మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఈ నెల 28న నిర్వహించే ఈ భారీ రిసెప్షన్‌కు 20,000 మంది ఇండియన్ - అమెరికన్లు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

Miss America Nina Davuluri, Indian-origin news anchor to host Modi reception in New York

అమెరికాలో ఏ దేశాధినేత కోసం కూడా ఇంతటి అపూర్వ పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయలేదు. దీనిపై ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఫౌండేషన్ (ఐఏసీఎఫ్) ప్రతినిధి ఆనంద్ షా మాట్లాడారు.

ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత మాట్లాడితే వినాలని, ప్రపంచ మహోన్నత ప్రజాస్వామ్య దేశ ప్రజలు ఉత్సుకతతో ఉన్నారని తెలిపారు. అమెరికా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఐఏసీఎఫ్‌కు 400కి పైగా ఇండో-అమెరికన్ సంఘాలు మద్దతిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+