విశ్వసుందరిపై ‘ట్రంప్ కంపు’ వ్యాఖ్యలు (వైరల్ వీడియో)
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గతంలో చేనిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనను దారుణంగా వెంటాడుతున్నాయి. సోషల్ మీడియాలో ట్రంప్ వ్యాఖ్యలు మహాకంపు అంటు మండిపడుతున్నారు.
1996లో మిస్ యూనివర్స్ (విశ్వసుందరి)గా వెనిజులాకు చెందిన ఎలిషియా మచాడో గెలుపొందింది. ఆ సందర్బంలో డోనాల్డ్ ట్రంప్ ఆమెను ఆకాశానికి ఎత్తేసి పొగడ్తలతో ముంచెత్తారు. విశ్వసుందరి కిరీటం సొంతం చేసుకున్న ఎలిషియా మచాడో కొంత కాలానికి బరువుపెరిగింది.
అంతే విషయం తెలుసుకున్న డోనాల్డ్ ట్రంప్ ఆమె ముఖం మీదే మిస్ పిగ్గీ (పంది), ఈటింగ్ మిషిన్ (తిండిపోతు) అంటు నానా దుర్బాషలాడాడు. ఆమెను వ్యక్తిగతంగానే కాకుండా బహిరంగంగా, మీడియా ముందు నానా మాటలు అన్నారు.
ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న డెమెక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ట్రంప్ కంపు వ్యాఖ్యలు చేసిన వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోను ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది చూశారు.
చీ ట్రంప్ నీ నోరు ఇంత కంపా అని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. డిబేట్ సందర్బంగా డోనాల్డ్ ట్రంప్ తీరును హిల్లరీ క్లింటన్ బహిరంగంగానే కడిగేశారు. ట్రంప్ మహిళలను పందులు, కుక్కలు, బద్దకస్తులు అని అడ్డంగా తిట్టారని ఇదే సందర్బంలో ఎండగట్టారు.
మహిళలు గర్బవతులు అయితే వారికి ఉద్యోగం ఇచ్చిన వారికి పెద్ద తలనొప్పి వస్తుందని గతంలో ఆరోపించారని గుర్తు చేశారు. అందాల పోటీల్లో పాల్గొన్న ఓ మహిళను దారుణంగా మాట్లాడారని హిల్లరీ ఆరోపించారు.
మహిళలు అంటే గౌరవం లేని ట్రంప్ ను మీరు గెలిపిస్తారా అని హిల్లరీ క్లింటన్ అమెరికా ప్రజలను ప్రశ్నించారు. తాజాగా అమెరికా పౌరురాలిగా మారి ఓటు హక్కు పొందిన వెనిజుల సుందరి (మాజీ విశ్వసుందరి) ఎలిషియా మచాడో కూడా ఈ విషయంపై స్పందించారు.
ట్రంప్ కు అందాల పోటీలు అంటే ఇష్టమని, ఎప్పుడు వాటి చుట్టుతిరుగుతుంటారని, అయితే మహిళను ఇష్టం వచ్చినట్లు తిడుతుంటారని మండిపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను హిల్లరీ క్లింటన్ కు ఓటు వేస్తానని ఆమె తేల్చి చెప్పారు. తనను ట్రంప్ ఎంతగానో అవమానించారని ఎలిషియా మచాడో విషాదం వ్యక్తం చేశారు.
-
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్












Click it and Unblock the Notifications