ఆ వరల్డ్ బ్యూటీ కనిపించుటలేదు! బాయ్‌ఫ్రెండ్..(ఫోటో)

న్యూఢిల్లీ: మిస్ హొండురాస్ వరల్డ్ 2014 మరియా జోస్ అల్వరాడో, ఆమె సోదరి సోఫియా ట్రినిడాడ్‌లు అదృశ్యమయ్యారు. ఈ విషయాన్ని బ్యూటీ పేజేంట్ ఆర్గనైజర్ ఎడ్యూయార్డో జబ్లాష్ తెలిపారు. వారం రోజుల నుండి ఆమె ఆచూకీ లభించడం లేదని చెప్పారు.

పశ్చిమ హోండురాస్‍‌లోని శాంటా బార్బరాలో మరియా తన సోదరితో కలిసి ఓ పుట్టిన రోజు వేడుకల పార్టీకి హాజరు అయిందని, అప్పటి నుంచి వారిద్దరు ఎక్కడ ఉన్నదీ తెలియడంలేదని జబ్లా తెలిపారు. శనివారం వరకు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు.

miss world 2014 contestant goes missing

ఈ ఏడాది మిస్ హోండురాస్ వరల్డ్‌గా మరియా జోస్ అల్వరాడో ఎంపికయింది. వచ్చే నెల లండన్‌లో జరగనున్న మిస్ వరల్డ్ కాంటెస్ట్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ బ్యూటీ, ఆమె సోదరి గురువారం నుండి కనిపించడం లేదు.

హుండురాస్ పోలీసులు వీరిద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ నెలలో జరగనున్న మిస్ వరల్డ్ కాంటెస్టులో పాల్గొననున్న నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు. మరియా జోస్ అల్వరాడో వయస్సు 19.

ఆమెను చివరిసారిగా పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యేందుకు వాహనం ఎక్కినప్పుడే చూశారు. ఆ తర్వాత నుండి కనిపించడం లేదు. ఇందుకు సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకోని ప్రశ్నించారు. పోలీసులు ప్రశ్నించిన వారిలో ట్రినిడాడ్ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు.

నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, అందులో సోఫియా ట్రినిడాడ్ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని, వారిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+