టీమిండియా స్టార్ ప్లేయర్లతో మిస్ వరల్డ్ చెట్టాపట్టాల్

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు భారీ స్కోర్ సాధించింది. తొలి ఇన్నింగ్‌లో 438 పరుగులు చేసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్ ఆడుతోంది. మూడో రోజు వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది. ఓపెనర్ క్రెయిగ్ బ్రేత్‌వైట్- 48, టాప్ ఆర్డర్ బ్యాటర్ కిర్క్ మెకెంజీ 32 పరుగులతో ఆడుతున్నారు. మరో ఓపెనర్ టగెనారాయణ్ చందర్‌పాల్ 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

తొలి ఇన్నింగ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇది అతని 500వ మ్యాచ్ కూడా. ఈ ల్యాండ్ మార్క్ మ్యాచ్‌లో కోహ్లీ 121 పరుగులు చేశాడు. 500వ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన మొట్టమొదటి క్రికెటర్ అతనొక్కడే. ఇప్పటివరకు ఈ ఘనతను అందుకున్న ప్లేయర్ మరొకరు లేరు. ఓపెనర్ యశస్వి జైస్వాల్- 57, కేప్టెన్ రోహిత్ శర్మ- 80 సత్తా చాటారు.

Miss World Ache Abrahams of Trinidad and Tobago meets team India players

శుభ్‌మన్ గిల్- 10, అజింక్య రహానె-10 మరోసారి విఫలం అయ్యారు. క్రీజ్‌లో కుదురుకోలేకపోయారు. రవిచంద్రన్ అశ్విన్ అర్ధసెంచరీలు సాధించడంతో టీమిండియా 400 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా-61, రవిచంద్రన్ అశ్విన్-56, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్-25, జయదేవ్ ఉనద్కత్-7, మహ్మద్ సిరాజ్-0, ముఖేష్ కుమార్-0 పరుగులు చేశారు.

కాగా- మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మిస్ వరల్డ్ ఆఫ్ ట్రినిడాడ్ అండు టొబాగో ఆచె ఆబ్రహామ్స్.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియానికి వచ్చారు. శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్‌లు కలిశారు. వారితో కలిసి ఫొటోలు దిగారు.

ట్రినిడాడ్ అండ్ టొబాగోకే చెందిన వెస్టిండియన్ లెజెండరీ బ్యాటర్ బ్రియాన్ లారా ఆహ్వానం మేరకు ఆమె క్వీన్స్ పార్క్ ఓవల్‌కు వచ్చారు. బ్రియాన్ లారాను ఓ లెజెండ్‌గా అభివర్ణించారు. యువతలో స్ఫూర్తినింపారని ప్రశంసించారు. కరేబియన్ దీవుల్లో క్రికెట్‌తో పాటు ఇతర క్రీడాకారులకూ లారా ఓ రోల్ మోడల్ అని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+