ఘోరం: బాలికపై లైంగిక వేధింపులు.. ఫేస్ బుక్ లో లైవ్.. చూశారుకానీ ఒక్కళ్లూ ఫిర్యాదు చేయలేదు
ఓ బాలికపై జరుగుతున్న లైంగిక వేధింపులను ఫేస్ బుక్ లైవ్ లో ఓ డజను మంది కళ్లప్పగించి మరీ చూశారు కానీ, వాళ్లలో ఒక్కళ్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
చికాగో: ఒక బాలికపై లైంగిక వేధింపులు జరుగుతుంటే కళ్లప్పగించి చూశారు కానీ, చూసిన వాళ్లలో ఒక్కళ్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇంతకన్నా ఘోరమైన విషయం ఇంకేదైనా ఉంటుందా? మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందా? కనీస బాధ్యత కూడా లేదా? అనిపిస్తుంది ఈ వార్త చదివితే.
అమెరికాలోని చికాగో నగరంలో ఓ బాలిక(15)పై పలువురు వ్యక్తులు లైంగిక హింసకు పాల్పడ్డారు. ఆ ఘటన ప్రముఖ సామాజిక మధ్యమం ఫేస్ బుక్ లో లైవ్ ఫీచర్ ద్వారా ఆన్ లైన్ లో ప్రత్యక్ష ప్రసారం కూడా జరిగింది.

ఒక డజను మంది ఆ అమ్మాయిపై జరుగుతున్న లైంగిక దాడిని చూస్తూ ఉండిపోయారేకానీ.. కనీసం 911కు డయల్ చేసి ఫిర్యాదు చేద్దామని ఒక్కరికీ అనిపించలేదు. ఈ విషయాన్ని పోలీసులే వెల్లడించారు. మనం పోలీసులను కరుడుగట్టిన వాళ్లలా చూస్తాం కానీ ఈ ఘటనపై వాళ్లు ఫీలయినంతగా లైవ్ చూసిన వ్యక్తులు ఫీలవలేదు.
సదరు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు చికాగో పోలీస్ అధికారి ఆంటోనీ తెలిపారు. షాపుకు వెళ్లడం కోసం ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆ అమ్మాయి అదృశ్యమైనట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.
వారి ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు చివరికి ఆ బాలికను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్రిమినల్ లైంగిక నేరం కింద కేసు నమోదు చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నామని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications