ఎంహెచ్ 370తో పోల్చలేం: అబాట్, జావాలో ప్లేన్ డోర్, శిథిలాలు..!

సిడ్నీ: గల్లంతైన ఎయిర్ ఏషియా విమాన ఘటనను ఈ ఏడాది మార్చి 8న అదృశ్యమైన కౌలాలంపూర్ - బీజింగ్ విమానం ఎంహెచ్ 370తో సరిపోల్చడం పెద్ద పొరపాటు అని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ అన్నారు. ఎంహెచ్ 370 అదృశ్యం కావడం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిందని, తాజా సురబయ - సింగపూర్ విమానం క్యూజెడ్8501 విషయంలో మాత్రం అలాంటిదేమీ లేదని సోమవారం సిడ్నీ రేడియో కేంద్రం ద్వారా మాట్లాడారు.

సింగపూర్ వెళ్తున్న విమానం భయానక వాతావరణంలో చిక్కుకొని కూలిపోయిందని చెప్పారు. 2014లో చోటు చేసుకున్న ఘటనలను అబాట్ ప్రస్తావించారు. వైమానిక నిపుణులు ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు సూచిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Missing AirAsia plane no MH370 mystery: Australia PM Tony Abbott

ఎత్తు పెంచుకోవడానికి ఎందుకు అనుమతించలేదంటే..

ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్న విమానాన్ని ఎడమ వైపు నడిపి, ఎత్తుకు 32వేల అడుగుల నుండి 38వేల అడుగులకు పెంచుకోవడానికి పైలట్ అడిగిన విషయం తెలిసిందే. దీనిపై ఏటీసీ నుండి వెంటనే అనుమతికి రాలేదు. దీనికి కారణాలు వెల్లడించారు.

ఇతర విమానాలు ఆ ఎత్తులో ప్రయాణిస్తూ ఉండటమేనని ఏటీసీ ఇంఛార్జ్ బాంబంగ్ చెప్పారు. జావా సముద్రం సమీపంలో ఈ సమయంలో వాతావరణం ఎలా ఉంటుందో తెలియనిది కాదని, అయితే అది విమానాన్ని అదుపు చేయలేనంత తీవ్రమైంది మాత్రం కాదని, ప్రతికూల వాతావరణంలోను పనిచేయగల వ్యవస్థ ఎ320-200 విమానాల్లో ఉంటుందని, వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తుంటుందని విశ్రాంత పైలట్ జలీల్ మట్ డోమ్ చెప్పారు.

ప్రతికూల వాతావరణంతో పాటు అంతకుముందిన కారణాలు ఏమైనా ఉండవచ్చునని మలేషియా వైమానిక నిపుణులు అహ్మద్ బద్దాయ్ అన్నారు. విమాన గల్లంతు ఘటన నేపథ్యంలో ఎయిర్ ఏషియా విమానాల కార్యకలాపాల పైన సమీక్ష చేపడుతున్నట్లు ఇండోనేషియా రవాణా శాఖ మంత్రి తెలిపారు. ఇప్పటి దాకా తమ విమానాల ద్వారా ఎవరు ప్రాణాలు కోల్పోలేదని ఎయిర్ ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండేజ్ తెలిపారు.

పొగమంచు ఆటంకం

గల్లంతైన ఎయిర్ ఏషియా క్యూజెడ్ 8501 విమానం కోసం గాలింపు సాగుతోంది. అయితే, పొగమంచు కారణంగా ఆటంకం ఏర్పడుతోంది.

విమానం డోర్, శిథిలాలు

ఎయిర్ ఏషియాకు చెందిన విమానం డోర్, శిథిలాలు కనిపించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏటీసీతో విమానం కాంటాక్ట్ ఎక్కడ అయితే పోయిందో, అక్కడి నుండి ఆరు మైళ్ల దూరంలో, జావా సముద్రంలో పది శిథిలాలు గుర్తించారు. అయితే, ఇవి ఆ విమానానివేనా అని గుర్తించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+