ఎంహెచ్ 370: విమానం పైలట్ అప్‌సెట్‌లో ఉన్నాడా?

కౌలాలంపూర్: దక్షిణ హిందూ మహాసముద్రంలో జలసమాధి అయినట్లుగా భావిస్తున్న మలెషియా ఎయిర్ లైన్స్ ఎంహెచ్

370 విమానం పైలట్ జహారీ ఆహ్మద్ షా అప్ సెట్‌గా ఉన్నట్లుగా ఆయన స్నేహితుడు వెల్లడించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతను తన రిలేషన్‌షిప్స్‌కు సంబంధించిన సమస్యలతో ఉన్నారట.

కాగా, హిందూ మహాసముద్రంలో కూలిపోయినట్టు భావిస్తోన్న మలేసియా ఎయిర్‌లైన్స్ విమానానికి సంబంధించి తాజా వివరాలు మరిన్ని లభించడంతో విమాన శకలాల కోసం గాలింపు ఇప్పుడు హిందూ మహాసముద్రానికి మారింది. మరోవైపు మలేసియా ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆరోపిస్తూ విమానంలోని చైనా ప్రయాణికుల బంధువులు బీజింగ్‌లోని మలేసియా దౌత్యకార్యాలయం వద్ద పోలీసులతో ఘర్షణకు దిగారు.

ఇదిలావుండగా మలేసియా ప్రభుత్వం స్పందన సంతృప్తికరంగా లేదని ప్రస్తుతం యూరప్‌లో పర్యటిస్తోన్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అంటూ, 154మంది చైనీయులతో పాటుగా 239 మంది ప్రయాణిస్తున్న విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయిందని నిర్ధారించిన ఉపగ్రహ సమాచారాన్ని తమకు అందించాలని డిమాండ్ చేశారు.

 ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

మలేసియా ప్రభుత్వంతో విమానం విషయంపై చర్చించేందుకు ప్రత్యేక దూతను కౌలాలంపూర్ పంపిస్తున్నట్టు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చెప్పారు. ఒక చివరి ఎలక్ట్రానిక్ సిగ్నల్ సహా ఉపగ్రహానికి సంబంధించిన సమాచారాన్ని తాజాగా విశ్లేషిస్తున్నట్టు కౌలాలంపూర్‌లో మలేసియా రక్షణ మంత్రి హిషముద్దీన్ హుస్సేన్ చెప్పారు.

 ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

మిగతా కమ్యూనికేషన్లన్నీ మూసుకుపోయినప్పటికీ మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం పింగ్ (హ్యాండ్‌షేక్) అనే సిగ్నల్‌ను గంటకోసారి ఇన్మార్‌శాట్ ఉపగ్రహానికి పంపించింది.

ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

ఈ సిగ్నల్స్ విమానం ఎక్కడ ఉంది, దాని వేగం, లేదా అది ఎటుగా వెళ్తూంది లాంటి వాటిని చెప్పకపోయినప్పటికీ ప్రాథమిక విశ్లేషణను బట్టి చివరిసారిగా వచ్చిన సిగ్నల్స్ మలేసియా ద్వీపకల్పం ఉత్తర, దక్షిణ చివర్లలోని ఒకటి, రెండు విశాల ప్రాంతాలనుంచి వచ్చినట్టు తెలుస్తోంది.

 ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

ఇదిలావుండగా, మలేసియా ప్రభుత్వం దర్యాప్తును సరిగా చేపట్టలేదని, బీజింగ్‌కు వచ్చే ఈ విమానం అదృశ్యానికి సంబంధించిన తాజా సమాచారాన్ని తమకు తెలియజేయలేదని ఆరోపిస్తూ విమానంలోని చైనా ప్రయాణికుల కుటుంబ సభ్యులు బీజింగ్‌లోని మలేసియా దౌత్యకార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లారు.

ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

ప్రదర్శకులు దౌత్యకార్యాలయం పైకి నీళ్ల సీసాలు విసిరేసారని, భవనంలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారని, పోలీసులతో ఘర్షణ పడ్డారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+