ఐఎస్ఐఎస్ ఉగ్రవాదంలోకి మాజీ మోడల్, కాల్పుల్లో హతం

సిరియా: ఆస్ట్రేలియాకు చెందిన మాజీ మోడల్, డీజే ఒకరు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదుల తరఫున పోరాడుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అతని పేరు షార్కీ జామా. కొద్ది రోజుల క్రితం ఐసిస్‌లో చేరిన అతను, ఇప్పుడు తన ప్రాణాలను కోల్పోయాడు.

ఈ విషయాన్ని షార్కీ జామా తల్లిదండ్రులకు టెక్స్ట్ సందేశం ద్వారా తెలిపారు. అలాగే ఫోన్ కూడా చేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ విషయం తెలియగానే వారు ఆవేదనకు లోనయ్యారని ఆ కుటుంబానికి తెలిసిన హారాకో అనే వ్యక్తి చెప్పాడు.

 Model fighting for IS killed in Syria gunfire

షార్కీ జామా తన కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండేవాడని తెలిపారు. అయితే, అతను ఐసిస్‌లో జాయిన అయినట్లుగా ఆ తల్లిదండ్రులకు తెలియదని హారాకో చెప్పాడు. అతను ఐసిస్ పట్ల సానుకూలంగా ఉన్నాడనే విషయం తెలిసినప్పటికీ.. జాయిన్ అవుతాడనే విషయం తెలియదని చెప్పాడు.

కాగా, షార్కీ జామా కుటుంబం సాధారణ జీవితం గడుపుతోందని చెప్పారు. వారు ఐసిస్ విషయమై ఎప్పుడు కూడా అతనితో చర్చించలేదని చెప్పాడు. కాగా, ఐసిస్ ఉగ్రవాదుల ఘాతుకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+