గుడ్ న్యూస్: వృద్దుల్లో కూడా పనిచేస్తోన్న మెడెర్నా టీకా, యువతతో సమానంగా అంటోన్న సైంటిస్ట్స్
గుడ్ న్యూస్.. మెడెర్నా వ్యాక్సిన్ వృద్దులపై కూడా పనిచేస్తుందని ప్రతినిధులు బుధవారం వెల్లడించారు. యువత మాదిరిగానే వృద్దుల్లో కూడా యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకిన వృద్దులలో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నందున.. ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు భావించారు. అయితే పలువురు వృద్దులపై చేసిన ప్రయోగ ఫలితాలతో వస్తోన్న రిజల్ట్ కాస్త ఊరట కలిగిస్తోంది.
మెడెర్నా వ్యాక్సిన్ చివరి దశలో ఉంది. ఇప్పటివరకు వివిధ దశల్లో ప్రయోగించగా.. తాజాగా వృద్దులపై చేసిన ఎక్స్‌ఫర్‌మెంట్ రిజల్ట్ వెల్లడించారు. 55 ఏళ్లకు పైగా వయస్సు వారికి సానుకూల ఫలితాలు వచ్చాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 100 మెక్రోగ్రామ్ టీకా ఇవ్వడం వల్ల చలి, అలసట, జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పికి వాలంటీర్లు గురవుతున్నారని చెప్పారు. వృద్దులపై ప్రతికూల ఘటనలు ఏమీ ఎదుర్కొనలేదని మెడెర్నా పేర్కొన్నది.

56 మరియు 70 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో.. 18 నుండి 55 సంవత్సరాల వయస్సు గల వారిలో రోగనిరోధక ప్రతిస్పందనలు సమానంగానే ఉంటున్నాయని మోడెర్నా ప్రతినిధులు తెలిపారు. టీకా వృద్ధులలో పనిచేస్తోందా అనే దానిపై తొలుత తాము ఆందోళన చెందామని వివరించారు. కానీ వారు కూడా స్పందించారని ప్రతినిధులు తెలిపారు. మెడెర్నాఇప్పటివరకు 13,000 మందికి పైగా చివరి దశ వ్యాక్సిన్ ప్రయోగించింది.












Click it and Unblock the Notifications