టీ సెల్లర్ నుండి.. మోడీ నన్ను ఇంప్రెస్ చేశారు: ఒబామా, భారత్ పర్యటనపై గర్విస్తున్నా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా ఆదివారం నాడు భారత్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా టుడే ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ఈ ముఖాముఖిలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపించారు. అలాగే, భారత్ రెండోసారి పర్యటిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు.
మోడీ విజన్‌కు ఒబామా ఫ్లాట్ అయ్యారు! మోడీకి మంచి విజన్ ఉందని, ఆయన భారత్‌ను ప్రగతిపథంలోకి తీసుకు వెళ్లాలనుకుంటున్నారన్నారు. అడ్డంకులు ఎదురైనా ఎకనామిక్ గ్రోత్‌ను పెంచేందుకు మోడీకి సామర్థ్యం, సంసిద్దత ఉన్నాయన్నారు.

తీవ్రవాదం పైన నిలకడమీద ఉన్నారని చెప్పారు. ఇటీవల జరిగిన చారిత్రక ఎన్నికలు భారత్ ఎకనామిక్ గ్రోత్ కోరికకు అద్దం పడుతున్నాయన్నారు. ఓ సాధారణ చాయ్ అమ్ముకునే వ్యక్తి భారత ప్రధాని అయ్యారంటే... అది భారత ప్రజల యొక్క సామర్థ్యానికి నిదర్శనమన్నారు.
మోడీకి క్లియర్ విజన్ ఉందన్నారు. మోడీ శక్తిసామర్థ్యాలు తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. భారత్ - అమెరికా సంబంధాల పైన స్పందిస్తూ.. ఏ రెండు దేశాల మధ్య కూడా ప్రతి విషయంలోను అంగీకారం కుదిరే పని కాదన్నారు. అలాగే భారత్, అమెరికా మధ్యలో కూడా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
కొన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ ఇరు దేశాలు కూడా పరస్పరం గౌరవంతో ముందుకు వెళ్తాయన్నారు. అమెరికా ప్రధానిగా భారతదేశంలో రెండోసారి పర్యటిస్తున్నందుకు గర్విస్తున్నానని ఒబామా అన్నారు. భారత్‌లో రెండోసారి పర్యటిస్తున్న అమెరికా ప్రధానిని తానే అన్నారు.
-
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications