భార‌త్ నుంచి ఆస్ట్రియా ప‌ర్య‌టిస్తోన్న మూడ‌వ ప్ర‌ధానిగా మోఢీ!

జూలై 8, 9 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోఢీ రష్యాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అధ్యక్షుడు పుతిన్‌తో పలు అంశాలపై చ‌ర్చించ‌నున్నారు. రష్యా పర్యటన అనంత‌రం ప్రధాని మోఢీ జూలై 9, 10 తేదీల్లో ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. భార‌త్ నుంచి 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో పర్యటించనున్న మూడ‌వ‌ ప్రధానిగా మోఢీ నిలిచారు. ఆస్ట్రియా ఛాన్సలర్ ఆహ్వానం మేరకు ప్రధాని మోఢీ ఈ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోఢీ ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే తొలిసారి.

ఈ సమయంలో ఆస్ట్రియా అధ్యక్షుడిని కూడా కలుస్తార‌ని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్ల‌డించారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్‌ వాన్‌డెర్‌, ఛాన్సలర్‌ కార్ల్ నెహామర్‌తో ప్రధాని సమావేశమవుతారు. భారత, ఆస్ట్రియా వ్యాపారవేత్తలను ఉద్దేశించి మోదీ, ఆస్ట్రియా ఛాన్సలర్‌ ప్రసంగించనున్నారు. దీని తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలను పెంచేందుకు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కూడా మాట్లాడనున్నారు.

Modi is the third Prime Minister visiting Austria from India

గ‌తంలో ఇద్ద‌రు ప్ర‌ధానులు

గ‌తంలో ఆస్ట్రీయా ప‌ర్య‌ట‌న విష‌యానికి వ‌స్తే.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1971, 1983 సంవత్సరాల్లో ఈ దేశంలో పర్యటించారు. అలాగే, దేశ తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా 1955లో ఈ దేశాన్ని సంద‌ర్శించారు. నవంబర్ 1999లో అప్పటి భారత రాష్ట్రపతి ఆర్‌కే నారాయణన్ ఆస్ట్రియాను సందర్శించారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 2011లో ఆ దేశాంలో ప‌ర్య‌టించారు. 2014లో మోఢీ ప్రధాని అయినప్పటి నుంచి ఆస్ట్రియాతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు.

తన మొదటి పదవీకాలంలో జూన్ 2, 2017న సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా అప్పటి ఆస్ట్రియన్ ఛాన్సలర్ క్రిస్టియన్ కెర్న్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. నిజానికి, భారత్‌, ఆస్ట్రియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిరంతరం పెరుగుతూ వ‌స్తోంది. ఆస్ట్రియా భారతదేశానికి యంత్రాలు, ఆటోమోటివ్ భాగాలు, రసాయనాలను ఎగుమతి చేస్తుంది. అలాగే, మ‌న దేశం నుంచి ఆస్ట్రియాకు వస్త్రాలు, ఫార్మాస్యూటికల్స్, రసాయనాలను ఎగుమతి జ‌రుగుతోంది. ఈ స‌మావేశం ద్వారా సాంకేతికత మరియు పునరుత్పాదక ఇంధన రంగాలలో మరింత సహకారానికి అవకాశం ఉండ‌బోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+