Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోటీశ్వరుడినంటూ ప్లేన్‌లో వీరంగం: గెంటేశారు(వీడియో)

కాలిఫోర్నియా: తాను కోటీశ్వరుడినంటూ మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఓ వ్యక్తిని పోలీసులు విమానం నుంచి బయటికి గెంటేశారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

'నా వయసు 28ఏళ్లు, ఏడాదికి 4 మిలియన్ డాలర్లు సంపాదిస్తా, నాకు ఆరు సొంత ఇళ్లులున్నాయి. నువ్వేం చేయగలవు' అంటూ మరో ప్రయాణికుడితో గొడవపడ్డాడు డేవిడ్ బ్రకెట్.

Moment drunk California 'millionaire' is thrown off JetBlue flight

వివరాల్లోకి వెళితే.. పూటుగా మద్యం సేవించి జెట్‌బ్లూ విమానంలో ముగ్గురు వ్యక్తులు గొడవ పడుతూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేశారు. అక్కడకు వచ్చిన విమానసిబ్బందితోనూ మిలియనీర్ అని చెప్పుకున్న బ్రకెట్.. దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆఖరికి చేసేదేమీలేక, గట్టిగా అరుస్తూ ప్రయాణికులను ఇబ్బందుకు గురి చేస్తున్న ఆ ముగ్గురిని పోలీసుల సహాయంతో బయటకు పంపించారు.

లాంగ్ బీచ్‌ నుంచి సాక్రమెంటోకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మరో ప్రయాణికురాలు ఈ మొత్తాన్ని వీడియోతీసి సోషల్ మీడియాలో పెట్టడంతో మిలియనీర్ బాగోతం బయటకు తెలిసింది.

అయితే వీడియోలో మిలియనీర్‌గా చెప్పుకున్న డేవిడ్ బ్రకెట్‌ కాలిఫోర్నియా రియల్ ఎస్టేట్, మోర్టగేజ్ కంపెనీ హోమ్ ల్యాండ్ ఫైనాన్సియల్ నెట్‌వర్క్‌కి వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+