చాలా చింతిస్తున్నా: బిల్ క్లింటన్‌తో సంబంధంపై మోనికా

Monica Lewinsky breaks silence on affair with Clinton, says she 'deeply regrets it'
వాషింగ్టన్: గతంలో అమెరికా వైట్ హౌజ్‌లో పని చేసిన మోనికా లెవిన్‌స్కీ.. అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో తనకు గల సంబంధంపై స్పందించారు. గత కొంత కాలంగా వీరి సంబంధంపై పలు ఆరోపణలు వచ్చినప్పటికీ ఎలాంటి వ్యాఖ్యలు చేయని మోనికా, తన మౌనాన్ని వీడారు. ఓ మేగజైన్‌లో లెవిన్‌స్కీ.. బిల్ క్లింటన్‌తో సంబంధం గురించి పలు విషయాలు వెల్లడించారు.

తనకు, బిల్ క్లింటన్‌కు మధ్య జరిగిన దాని పట్ల తాను చాలా చాలా చింతిస్తున్నట్లు తెలిపారు. ఇక తనపై వస్తున్న ఆరోపణలకు ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. కాగా, ఇప్పుడు మళ్లీ మోనికా ఈ విషయాలను బయట పెట్టి, బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్‌పై బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని పలువురు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, బిల్ క్లింటన్‌తో తనకు మధ్య పరస్పర అంగీకార సంబంధమే ఉందని మోనికా లూయిన్ స్కీ ఆ కథనంలో వెల్లడించారు. 1999లో క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయం (వైట్‌హౌస్)లో ఆమె పని చేశారు. ఆ సమయంలో క్లింటన్‌తో మోనికా లూయిన్ లైంగిక సంబంధం కొనసాగించినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై తాజాగా మోనికా తన మనస్సులోని మాటలను వానిటీ ఫెయిర్ మేగజైన్‌కు ప్రత్యేక ఆర్టికల్ ద్వారా వెల్లడించారు.

క్లింటన్‌కు తనకు మధ్య అప్పట్లో ఉన్నది పరస్పర అంగీకార సంబంధమేనని తెలిపారు. తమ మధ్య జరిగిన దానిపై తీవ్రంగా విచారిస్తున్నానని ఆమె అందులో పేర్కొన్నారు. తమ మధ్య ఇద్దరు పెద్దవాళ్ల మధ్య ఉండే సంబంధమే నడిచిందని, క్లింటన్ అవకాశం తీసుకున్నాడని వెల్లడించారు. ఆ మేగజైన్ మోనికా కథనాన్ని ‘షేమ్ అండ్ సర్వవైల్' పేరిట ప్రచురితం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+