పాలపుంతకు అవతల..: షాకింగ్ విషయాలను వెల్లడించిన నాసా: వేలకొద్దీ
వాషింగ్టన్: అంతరిక్షం..అంతుచిక్కని, అంతు అనేదే లేని అద్భుతాలమయం. దశాబ్దాలుగా ప్రయోగాలు కొనసాగుతున్నప్పటికీ.. ఎన్నో ప్రశ్నలను మిగిల్చుతూనే ఉంటుంది. విశ్వాంతరాలపై ప్రయోగాలు సాగుతున్న కొద్దీ కొత్త కొత్త సంగతులు బయటపడుతూనే ఉంటాయి తప్ప.. వాటికి అంతం అనేది ఉండట్లేదు. వెలుగులోకి వచ్చిన ప్రతి సమాచారం కూడా అత్యంత ఆసక్తిని కలిగించేదే.. ఉత్కంఠతను రేకెత్తించేదే. అలాంటిదే మరో తాజా సమాచారాన్ని అంతరిక్ష పరిశోధకులు కనుగొన్నారు.
పాలపుంతకు అవతల..
మన సౌర వ్యవస్థ, పాలపుంతకు అవతల.. 5,000కు పైగా గ్రహాలు పరిభ్రమిస్తున్నాయట. అమెరికా అంతరక్ష పరిశోధన సంస్త.. నాసా ఈ విషయాన్ని ధృవీకరించింది. సౌర వ్యవస్థలోని గ్రహాలను పోలిన ప్లానెట్స్ ఉన్నాయని, వాటి సంఖ్య 5,000లకు పైమాటేనని తేల్చి చెప్పింది. భూమి, గురు, అంగారక గ్రహాలను పోలినవి ఉన్నాయని పేర్కొంది. 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న తమ పరిశోధనల్లో పరంపరంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికినట్టయిందని వ్యాఖ్యానించింది.

ఎక్సోప్లానెట్స్ అంటే..?
పాలపుంతకు అవతల పరిభ్రమించే గ్రహాలను ఎక్సోప్లానెట్స్‌గా పిలుస్తుంటారు అంతరిక్ష పరిశోధకులు. అలాంటి ఎక్సోప్లానెట్స్ కోకొల్లలుగా ఉన్నట్లే తాజా పరిశోధనల్లో తేలింది. ఇందులో కొన్ని పరిమాణంలో చాలా చిన్నవిగా, మరుగుజ్జు గ్రహాల్లా ఉన్నాయని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరి కొన్ని భూమిని పోలి ఉన్నాయని స్పష్టం చేశారు. కొన్ని గ్రహాలైతే సంపూర్ణంగా గ్యాస్ నిండిపోయి ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. అలాగే- మన సౌర కుటుంబంలోనే అతిపెద్దదైన జుపిటర్ కంటే భారీ సైజులో ఉన్న ప్లానెట్స్ కూడా ఉన్నాయని అన్నారు.

1992లో తొలి ఎక్సోప్లానెట్..
1992లో నాసా మొదటిసారిగా తొలి ఎక్సోప్లానెట్‌ను గుర్తించింది. అప్పటి నుంచీ అలాంటి గ్రహాల కోసం అన్వేషణ మొదలు పెట్టారు నాసా శాస్త్రవేత్తలు. అన్వేషణ కొనసాగుతున్న కొద్దీ కొత్త గ్రహాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికి వాటి సంఖ్య 5,000ను దాటినట్టు పసడెనాలోని నాసా ఎక్సోప్లానెట్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ సైన్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ జెస్సీ క్రిస్టియాన్సెన్ తెలిపారు. ఒక్కో ప్లానెట్.. ఒక్కో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించిందని వ్యాఖ్యానించారు.

వేల కాంతి సంవత్సరాల దూరంలో..
ఓ న్యూట్రన్ నక్షత్రాన్ని తాము కనుగొంటే- దాని చుట్టుపక్కల ఎక్సోప్లానెట్స్ ఉండితీరుతాయని అలెగ్జాండర్ వోల్స్ తెలిపారు. ఇలాంటి 100 నుంచి 200 బిలియన్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నామని క్రిస్టియాన్సెన్ పేర్కొన్నారు. గెలాక్సీ కేంద్రబిందువు దగ్గరి నుంచి లెక్కిస్తే- అవన్నీ 30 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయని అన్నారు. ఇప్పటిదాకా తాము గుర్తించిన ఎక్సోప్లానెట్స్‌లల్లో 4,900 గ్రహాలు కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో పరిభ్రమిస్తున్నాయని, ఈ విషయం తమను దిగ్భ్రాంతిని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.

కెప్లర్ టెలిస్కోప్‌ది కీ రోల్..
వాటి మధ్య ఉన్న దూరాన్ని పరిగణనలోకి తీసుకుంటే- సౌర కుటుంబం కంటే ఎన్నో రెట్ల దూరంలో అవి విస్తరించి ఉన్నాయని చెప్పారు. పాలపుంతకు అవతల ఉన్న కొత్త గ్రహాలను కనుగొనడంలో నాసా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ ఉపయోగపడింది. 2009లో దీన్ని నాసా ప్రయోగించింది. 2018 వరకు ఈ టెలిస్కోప్ తన అన్వేషణను కొనసాగించింది. ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ 2,700 ఎక్సోప్లానెట్స్‌ను గుర్తించింది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications