వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బహిరంగంగా.. 'అసహజ శృంగారం' : ఇద్దరు టీనేజీ యువతుల అరెస్టు

|
Google Oneindia TeluguNews

మొరాకో: ఇద్దరు టీనేజీ యువతులు అసహజ పద్దతిలో వ్యవహరించారన్న కారణంతో.. స్వలింగ సంపర్క నేరం కింద వారిద్దరిని అరెస్టు చేశారు మొరాకో పోలీసులు. బహిరంగ ప్రదేశంలో వీరిద్దరు ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం.. అసహజ శృంగారంగా పరిగణిస్తూ.. అక్కడి చట్టాలకు విరుద్దమన్న కారణంతో మర్రాకేచ్ ప్రాంతంలో వీరిని అరెస్టు చేశారు.

16,17 ఏళ్ల వయసున్న బాలికలను మర్రాకేజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా 'సీఎన్ఎన్' ద్వారా తెలిసింది. అయితే అరెస్టు అనంతరం వీరిద్దరిని బెయిల్ పై విడుదల చేశారు. మొరాకో చట్టం ప్రకారం సెక్షన్ 489 కింద వీరిద్దరిపై కోర్టులో విచారణ జరగనుంది. ఈ చట్టం కింద స్వలింగ సంపర్కాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అసహజ, అసభ్య పద్దతిలో వ్యవహరించేవారికి ఈ చట్టం కింద ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.

Moroccan teenage girls arrested for kissing released

ఇదిలా ఉంటే, బాలికల తరుపు వాదనను వినిపించేందుకు ఓ న్యాయవాదిని నియమించినట్టు మానవ హక్కుల సంఘం ప్రతినిధి ఒమర్ అర్బీబ్ ప్రకటించారు. సెక్షన్ 489ను రద్దు చేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్చను హరించేలా చట్టాలు ఉండరాదని ఆయన వాదిస్తున్నారు. ఇకపోతే బాలికలు మద్దతును తెలుపుతూ ఆల్టర్నేటివ్ మూవ్ మెంట్ ఫర్ ఇండివిడ్యువల్ లిబర్టీస్(ఎంఏఎల్ఐ) ఒక ఫోటోను ప్రచురించింది.

'మేము భిన్న లింగ సంపర్కులం ఎల్జీబీటి హక్కులకు మద్దతు ఇస్తా' మంటూ ఇద్దరూ యువతులు చేస్తున్న ప్రకటనతో ఆ ఫోటోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఇద్దరు యువతుల వ్యవహారం మొరాకో వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

English summary
Two teenage girls were allowed to return home on Thursday after being arrested on October 27 for kissing on a terrace in Marrakech thanks to the intervention of the Moroccan human rights association AMDH, which secured their release.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X