వెనిజులా చేరుకున్న రష్యా బలగాలు, ఉద్రిక్తతలు పెంచొద్దని అమెరికా వార్నింగ్

మాస్కో : వెనిజులా సంక్షోభం విషయంలో అమెరికా, రష్యా మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. తాజాగా రష్యన్ బలగాలు వెనిజులాలో అడుగుపెట్టడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. శనివారం రష్యాకు చెందిన వంద సైనిక బలగాలు కరాకస్‌కు చేరుకోవడంపై అమెరికా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా వెనిజులాలో ఉద్రిక్తతలను మరింత పెంచొద్దని రష్యాకు సూచించింది.

రెండు కార్గో విమానాల్లో రష్యా బలగాలు

రెండు కార్గో విమానాల్లో రష్యా బలగాలు

శనివారం రష్యన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు కార్గో విమానాలు, ఒక చిన్న ఎయిర్‌క్రాఫ్ట్ వెనిజులాలోని సిమోన్ బొలీవర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. వాటిలో రష్యా సైనిక బలగాలతో పాటు 35 టన్నుల మిలటరీ ఎక్విప్‌మెంట్ కూడా తీసుకొచ్చింది. ఈ విషయాన్ని రష్యా అధికార పత్రిక స్పుత్నిక్ కూడా ధ్రువీకరించింది. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న టెక్నికల్ మిలటరీ కాంట్రాక్ట్‌లో భాగంగానే రష్యా బలగాలను పంపిందే తప్ప ఇందులో రహస్యమేమీ లేదని స్పష్టం చేసింది.

1999 నుంచి వెనుజులాకు అండగా రష్యా

1999 నుంచి వెనుజులాకు అండగా రష్యా

1999లో హ్యూగో చావెజ్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి రష్యా, వెనిజులా మధ్య బంధం బలోపేతమైంది. ఇందులో భాగంగానే వెనిజులా మిలటరీకి అవసరమైన ఆర్థిక, దౌత్యపరమైన సహకారాన్ని రష్యా అందిస్తోంది. తాజాగా వెనిజులాలో నెలకొన్న సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తుండటం ఈ రెండు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసింది. వెనిజులాలో నికోలస్ మాధురో ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో వెనిజులా నిర్వహించిన మిలటరీ డ్రిల్‌కు రెండు టీయూ 160 లాంగ్ రేంజ్ బాంబర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను పంపిన రష్యా అమెరికాకు హెచ్చరికలు పంపింది.

ఉద్రిక్తతలు పెంచొద్దన్న అమెరికా

ఉద్రిక్తతలు పెంచొద్దన్న అమెరికా

వెనిజులాలో రష్యా బలగాల మోహరింపుతో అమెరికా అప్రమత్తమైంది. తాజా పరిణామాలపై యూఎన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రష్యా దుందుడుకు చర్యల్ని మానుకోవాలని, వెనిజులాలో ఉద్రిక్తలను మరింత పెంచవద్దని అమెరికా సూచించినట్లు తెలుస్తోంది. అయితే రష్యా అధికారిక పత్రిక స్పుత్నిక్ మాత్రం అమెరికా నుంచి ఫోన్ వచ్చిన మాట వాస్తవమేనని, అయితే బలగాలకు సంబంధించిన అంశంపై ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+