వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రిక్కీ ప్రశ్న: అగ్ని ప్రమాదం సంభవిస్తే తల్లినా? గర్ల్ ఫ్రెండ్‌నా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బీజింగ్: "భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒకరినే కాపాడాలంటే ఎవరిని కాపాడతారు? తల్లినా? గర్ల్ ఫ్రెండ్ నా?" న్యాయమూర్తులు, న్యాయవాదుల పోస్టుల భర్తీ నిమిత్తం చైనా జాతీయ న్యాయ విభాగం అడిగిన ఓ ఆసక్తి కరమైన ప్రశ్న ఇది.

దీంతోపాటు ఓ వ్యక్తి తన తల్లిని కాపాడే అవకాశాలు ఉన్నా, గర్ల్ ఫ్రెండ్‌ని కాపాడేందుకు నిర్ణయించుకుంటే నేరం చేసినట్టా? అని అడిగారు. తాజాగా చైనాలో డ్రగ్‌లాస్, రహదారులు, కాలుష్యం, మోసాలు, లంచం, హత్య తదితర తీవ్ర నేరాలకు సంబంధించి అభ్యర్థులు తమకిష్టమైన చాయిస్‌లను ఎంచుకునే అవకాశాన్ని చైనా అందించింది.

 Mother or Girlfriend - Who Do You Save in a Fire, Asks This Exam Paper

మరికొన్ని ప్రశ్నలు చాలా ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని వీటికి హాజరైన వారు వ్యాఖ్యానించారు. లైఫ్ గార్డులో ఉద్యోగంలో ఉండి, మునిగిపోతున్న చిన్నారిని కాపాడలేకపోతే, విడాకుల కేసు నడుస్తున్న వేళ, భర్త తన భార్యను ప్రమాదం నుంచి రక్షించకుంటే.. అంటూ పలు ఊహాజనిత ప్రశ్నలను అడిగి అభ్యర్థుల సహనానికి పరీక్ష పెట్టారు.

ఈ పరీక్షకు హాజరైన న్యాయమూర్తులు, న్యాయవాదులు సమాధానాల్లో తీవ్ర ఇబ్బంది పడ్డామని చెప్పారు. పరీక్షల అనంతరం ఈ ప్రశ్నలకు చైనా న్యాయ శాఖ సమాధానాలు ఇచ్చింది. ఈ సమాధానాల్లో తల్లిని కాపాడలేకపోవడం నేరమని స్పష్టం చేసింది.

మునిగిపోతున్న చిన్నారిని కాపాడాల్సిన ఉద్యోగంలో ఉన్న లైఫ్ గార్డు విధి నిర్వహణలో అలక్ష్యం చూపినట్టేనని, చైనా చట్టాల ప్రకారం వ్యక్తికి తన గర్ల్ ఫ్రెండ్ కన్నా తల్లే ముఖ్యమని తెలిపింది. ఇప్పుడీ ప్రశ్నలు, సమాధానాలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.

English summary
Will you save your mother or girlfriend in case of a deadly fire? This tricky question was asked to hundreds of thousands of trainee lawyers and judges taking China's National Judicial Exam which is designed to assess whether the examinee is qualified to practice law in China or not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X