పిక్చర్స్: యుఎస్ కాల్పుల వెనక, వైట్‌హౌస్ దగ్గర్లోనే...
వాషింగ్టన్: దండగులు కాల్పులు వాషింగ్టన్ నేవీ యార్డు అమెరికా శ్వేత సౌధానికి సమీపంలోనే ఉంది. కాల్పులు జరిపిన సాయుధుల్లో ఒకతను మరణించగా, మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. షూటర్‌తో పాటు కాల్పుల్లో 13 మంది మరణించినట్లు వాషింగ్టన్ డిసి మేయర్ విన్సెంట్ గ్రే మీడియా ప్రతినిధులతో చెప్పారు.
కాల్పుల వెనక ఉద్దేశం ఏమిటో తెలియదని, దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తామని, ఉగ్రవాదుల పని అయి ఉంటుందా అనేది ఇప్పుడే చెప్పలేమని, అయితే దాన్ని కూడా తోసిపుచ్చలేమని ఆయన అన్నారు. మరణించిన షూటర్ టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌కు చెందిన 34 ఏళ్ల ఆరోన్ ఎలెక్సిన్‌గా గుర్తించారు.
వేరే వ్యక్తి గుర్తింపు కార్డును వాడి ఆరోన్ లోనికి ప్రవేశించాడని చెబుతున్నారు. అతను ఒక్కడే లోనికి వెళ్లాడా, అతనితో పాటు మరింత మంది వెళ్లారా అనేది కూడా తేలలేదని అంటున్నారు. మరో ఇద్దరు అనుమానితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఇద్దరిలో ఒకతనికి సంబంధం లేదని తేలినట్లు గ్రే తెలిపారు. 50 ఏళ్ల ఆఫ్రికన్ - అమెరికన్ వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

వాషింగ్టన్‌లో..
వాషింగ్టన్ నేవీ యార్డులో కాల్పులు జరిగిన నేపథ్యంలో అమెరికా కాపిటోల్ పోలీసు అధికారులు కాపిటోల్ ఈస్ట్ ప్లాజాలో నిఘాను పెంచారు.

తలలు పట్టుకున్నారు..
వాషింగ్టన్ నేవీ యార్డులో కాల్పులు జరిగిన నేపథ్యంలో భవనంలోంచి ఎస్కార్ట్ సాయంతో బయటకు తీసుకుని వస్తుండగా వ్యక్తులు తమ చేతులతో తలలు పట్టుకున్నారు.

నేవీ యార్డులో కాల్పులు
వాషింగ్టన్ నేవీ యార్డులో సాయుధులు కాల్పులు జరిపిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఓ సాయుధుడు లోనికి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో 12 మందితో పాటు ఓ సాయుధుడు మృతి చెందాడు.

సహాయక చర్యలు..
ఓ సాయుధుడు వాషింగ్టన్ నేవీ యార్డులో కాల్పులు జరిపిన నేపథ్యంలో సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన ఎమర్జెన్సీ పర్సనల్..

యుఎస్ పార్కు పోలీసు హెలికాప్టర్
రంగంలోకి దిగిన యుఎస్ పార్కు పోలీసు హెలికాప్టర్. కాల్పులు జరిపిన సాయుధుల్లో ఒకతను మరణించగా, మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నావల్ సీ సిస్టమ్స్ కమాండ్ హెడ్‌క్వార్టర్‌లో దాదాపు 3000 మంది పనిచేస్తుంటారు.

ఎం స్ట్రీట్ సంఘటనా స్థలం వద్ద పోలీసులు
వాషింగ్టన్ నేవీ యార్డు వద్ద ఎం స్ట్రీట్ సంఘటనా స్థలంలో పోలీసులు సోమవారం ఉదయం ఇలా కనిపించారు..

కాల్పులపై ఒబామా ప్రతిస్పందన
వాషింగ్టన్ నేవీ యార్డులో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. అంతకు ముందు ఆయన శ్వేతసౌధం సముదాయంలోని సౌత్ కోర్టు ఆడిటోరియంలో నేవీ యార్డు ఘటనపై మాట్లాడారు.












Click it and Unblock the Notifications