జింబాబ్వే వ్యవహారం: రాజీనామాకు సైన్యం ఒత్తిడి, మొండికేస్తున్న ముగాబే..

గృహ నిర్బంధంలో ఉన్న జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే చేత బలవంతంగా పదవికి రాజీనామా చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సైన్యం ఒత్తిడికి ఆయన తలొగ్గలేదు. రాజీనామాకు నిరాకరించారు.

హరారే: గృహ నిర్బంధంలో ఉన్న జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేయమంటూ కొందరు సైన్యాధికారులు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు.

శుక్రవారం ముగాబేతో కొందరు సైన్యాధికారులు సమావేశమై చర్చించారు. రాజీనామా చేయాలని కొందరు ఆయనపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. అనంతరం పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ సైన్యాధికారి మాట్లాడుతూ 'ముగాబేను మేం కలిశాం. పదవి నుంచి తప్పుకొనేందుకు ఆయన నిరాకరించారు. ఆయనకు మరికొంత సమయం ఇచ్చి చూస్తాం..' అని వ్యాఖ్యానించారు.

Mugabe resists pressure to resign as detention pictures emerge

ప్రస్తుతం ముగాబేను ఆ దేశ సైన్యం గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. ముగాబే తన రాజకీయ వారసురాలిగా భార్య గ్రేస్‌ను నిలబెట్టడాన్ని మాజీ ప్రధాని మోర్గాన్‌ సవంగిరాయ్‌తో పాటు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

మరోవైపు మాజీ ప్రధాని సవంగిరాయ్‌ మీడియాతో మాట్లాడుతూ 'ఆయన తప్పకుండా తన పదవికి రాజీనామా చేయాలి.. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు..' అని వ్యాఖ్యానించారు.

మరోవైపు జింబాబ్వేలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సదరన్‌ ఆఫ్రికన్‌ డెవలప్‌మెంట్‌ కమ్యూనిటీ(ఎస్‌ఏడీసీ) ప్రయత్నిస్తోంది. శాంతి యుతంగా జింబాబ్వే సమస్యను పరిష్కరించేందుకు సహాయం చేయాల్సిందిగా ఎస్‌ఏడీసీ పొరుగు దేశాలకు విజ్ఞప్తి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+