తాలిబన్ సుప్రీం కమాండర్ ముల్లా ఒమర్ మృతి?
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ సూప్రీం కమాండర్ ముల్లా మహ్మద్ ఒమర్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రముఖ వార్తా సంస్థ బిబిసి కూడా ఒమర్ మరణించినట్లు కథనాలను ప్రచురితం చేసింది. అయితే, దీని గురించి తాలిబన్ వర్గాలు మాత్రం అధికారికంగా ఏమీ వ్యాఖ్యానించలేదు.
కాగా, ఒమర్ రెండు మూడేళ్ల క్రితమే చనిపోయాడని అఫ్ఘాన్ ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు మాత్రం ఆ దేశ అధికార వర్గాలు ధృవీకరించాయి. అయితే దీని గురించిన తదుపరి వివరాలేవీ వెల్లడించలేదు.

అయితే ఈ విషయమై తాలిబన్ వర్గాలు త్వరలోనే ఒక ప్రకటన విడుదల చేస్తాయని తాలిబన్ ప్రతినిధి ఒకరు చెప్పారు.
ముల్లా ఒమర్ చనిపోయినట్లు గతంలోనే పలు రకాల కథనాలు వచ్చాయి. అయితే ఎప్పుడూ తాలిబన్లు వాటిని ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా కూడా ఒమర్ మరణించాడని పేర్కొంటున్నాయి.












Click it and Unblock the Notifications