Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బంపర్ ఆఫర్: ఒక్క అక్షరానికి అర్థం చెప్పినా రూ.లక్షలు మీ సొంతం.. ప్రయత్నిస్తారా?

చైనాలోని హెనన్‌ ప్రావిన్సులో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాలలో బయటపడిన ఎముకలు, ఎద్దు పుర్రె.. తాబేలు కవచంలాంటి వాటిపై ఆ కాలం నాటి లిపి గుర్తులున్నాయి. ఇవి ఏంటో అర్థం కాకపోవడంతో చైనా పురావస్

బీజింగ్: సాధారణంగా చారిత్రక ప్రదేశాల్లో పురాతన వస్తువులు.. శిలశాసనాలు ఇతరత్రా లభిస్తుంటాయి. వాటిపై లిపి గురించి.. వాటి ప్రాముఖ్యత గురించి సాధారణ ప్రజలకు ఏమీ తెలియవు.

పురావస్తుశాఖ అధికారులు.. చరిత్రకారులు మాత్రమే వాటి గురించి అధ్యాయనం చేసి ప్రాముఖ్యతను తెలియజేస్తారు. మ్యూజియాల్లో భద్రపరుస్తారు. సందర్శకులకు వాటిపై ఉన్న సందేహాలను నివృత్తి చేస్తారు.

Museum Offers $15,000 Per Character to Decipher Oracle Bone Script

కానీ.. చైనాలో తవ్వకాల్లో బయటపడిన ఎముకలపై ఉన్న లిపి అర్థం తెలుపమని పురావస్తుశాఖకు చెందిన మ్యూజియమే ప్రజలను కోరుతోంది. అంతేకాదు.. లిపిలోని ఒక్క అక్షరానికి అర్థం చెప్పినా లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని చెబుతోంది.

19వ శతాబ్దంలో చైనాలోని హెనన్‌ ప్రావిన్సులో పురావస్తు శాస్త్రవేత్తలు పలు ప్రాంతాల్లో జరిపిన తవ్వకాలలో అక్షరాలు చెక్కి ఉన్న ఎముకలను గుర్తించారు. ఎద్దు పుర్రె.. తాబేలు కవచంలాంటి వాటిపై ఆ కాలం నాటి లిపి గుర్తులున్నాయి.

కొన్నాళ్లుగా అలాంటి ఎముకలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 2 లక్షల ఎముకలు సేకరించగా అందులో 50 వేలకుపైగా ఎముకలపై అక్షరాలు ఉన్నాయి. అయితే వాటిపై ఏం రాశారో.. ఆ లిపి ఏంటో తెలుసుకునేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కానీ వారి వల్ల కావట్లేదు. ఆ లిపిలోని అక్షరాలకు అర్థం ఏమిటన్నది ఎంత శోధించినా అర్థం కావట్లేదు.

దీంతో 'నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ చైనీస్‌ రైటింగ్‌ అన్యాంగ్‌' సాధారణ పౌరులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ లిపి తెలిసి ఉంటే.. అక్షరాలకు అర్థం తెలిస్తే తమకు తెలియజేయాలని ఆహ్వానించారు. ఒక్క అక్షరం అర్థం చెబితే రూ.9.6 లక్షలు, ఒక్క అక్షరం అర్థం ఏమిటో తమతో చర్చించగలిగినా.. తెలిసిన సమాచారం ఇవ్వగలిగినా రూ.4.8 లక్షలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది.

అయితే అక్షరాన్ని.. దాన్ని అర్థాన్ని కనీసం రెండు భాషల్లో నైపుణ్యం ఉన్న వారు నిర్ధారించి.. రుజువులతో చెప్పగలిగితేనే బహుమతి ఉంటుందని షరతు పెట్టింది. మరింకేం.. మీరూ ప్రయత్నించి చూడండి.. ఏమో ఎవరు చెప్పొచ్చారు.. మీ బుర్రకు ఆ అక్షరాలు అర్థమవుతాయేమో!

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+