షాక్: ముస్లీం జంటను విమానం నుంచి దింపేశారు
చికాగో: పాకిస్తాన్ - అమెరికన్ జంటకు అమెరికాకు చెందిన ఓ విమానంలో చేదు అనుభవం ఎదురయింది. వారు చెమటలు కక్కుతుండటం, అల్లా పేరు పలుమార్లు ఉచ్చరించడాన్ని గమనించిన తోటి ప్రయాణీకులు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో వారిని విమానం నుంచి దింపేశారు.
నజియా, ఫైసల్ ఆలీ తమ పదవ పెళ్లి వేడుకను వారం పాటు ప్యారిస్‌లో సంతోషంగా జరుపుకున్నారు. తిరిగి అమెరికా ఓహియోలోని సిన్సినాటి వెళ్లేందుకు డెల్టా ఎయిర్ లైన్స్ విమానం ఎక్కారు. తమ సీట్లలో కూర్చున్న తర్వాత నజియా తన సెల్‌ఫోన్లో తల్లిదండ్రులకు సందేశం పంపించింది.

ఆమె భర్త ఫైసల్ అలీ ఓ సెల్‌ఫోన్ దాయడంతో పాటు చెమటలు కక్కుతున్నాడు. వారి తీరు ప్రయాణీకులకు అనుమానం కలిగించింది. విమానయాన సిబ్బంది అక్కడకు వచ్చారు. ఆ జంట అప్పుడప్పుడు అల్లాహో అని ఉచ్చరించారు. దీంతో ప్రయాణీకులు అనుమానంతో ఫిర్యాదు చేశారు.
ఈ జంటపై అనుమానం కలగడంతో పైలెట్ గ్రౌండ్ సిబ్బందికి విషయం తెలిపాడు. లోపలకు వచ్చిన సదరు అధికారి ముస్లిం జంటను విమానంలో నుంచి దించాడు. అనంతరం వారిని ప్రశ్నించగా.. ఎలాంటి సమస్యలేదని నిర్థారించారు. దీంతో అమెరికాకు ఇస్లామోఫోబియా పట్టుకుందని ఈ జంట విమర్శించింది. ఎయిర్ లైన్స్ తీరుపై అమెరికా రవాణా శాఖకు ఫిర్యాదు చేశారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications