మద్యం అందించలేదని మహిళను సస్పెండ్ చేశారు
అలాబామ: విమానంలో ప్రయాణికులకు మద్యం అందించలేదనే కారణంగా.. తనను విధుల నుంచి సస్పెండ్ చేశారని ఓ మహిళా ఉద్యోగి అమెరికాకు చెందిన ఎక్స్‌ప్రెస్ జెట్ ఎయిర్‌లైన్స్‌పై ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళితే.. డెట్రాయిట్‌కి చెందిన చారీ స్టాన్లే అనే ముస్లిం మహిళ గత మూడేళ్లుగా ఎయిర్‌లైన్స్‌లో ఫ్త్లెట్ అటెండెంట్‌గా ఉద్యోగం చేస్తోంది.
అయితే తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని, తమ మతధర్మానికి విరుద్ధంగా ప్రయాణికులకు మద్యం సరఫరా చేయమన్నారని.. నిరాకరించినందుకు సస్పెండ్ చేశారంటూ ఆమె ఈక్వల్ ఎంప్లాయిమెంట్ అపార్చునిటీ కమిషన్‌కి ఫిర్యాదు చేసింది.

కాగా, ఆమె సహోద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకే చారీ స్టాన్లేను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇది ఇలా ఉండగా, తమ దగ్గర పనిచేసే ఉద్యోగులందరి మతవిశ్వాసాలను తాము గౌరవిస్తామని, ఆమెకు నచ్చని పని చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆమె పనిని మరో అటెండెంట్‌కు అప్పజెప్పి సర్దుబాటు చేసుకునే అవకాశం ఎప్పుడూ ఉందని కంపెనీ నిర్వాహకులు తెలియజేశారు.












Click it and Unblock the Notifications