బురఖా వేసుకుంటే ఉద్యోగం పోయింది
వాషింగ్టన్: తమ మత సాంప్రదాయం ప్రకారం బురఖా వేసుని వెళ్లిన మహిళను ఉద్యోగం నుంచి తొలగించారు. అమెరికాలోని వర్జీనియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేవలం బురఖా వేసుకున్నందుకే ఉద్యోగంలో నుంచి తొలగించారని వెలుగు చూసింది.
ఫెయిర్ ఫ్యాక్స్ కౌంటీలో ఓక్స్ డెంటల్ కేర్ ఉంది. ఇక్కడ చుంక్ జూ అనే డాక్టర్ ఉన్నారు. ఈయన దగ్గర నజఫ్ ఖాన్ అనే మహిళ డెంటల్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరారు. ఇంటర్వూ సమయంలో, ఉద్యోగంలో చేరిన రెండు రోజుల వరకు ఆమె మామూలు దుస్తుల్లో డెంటల్ కేర్ కు వెళ్లారు.

తరువాత ఆమె బురఖా వేసుకోని ఉద్యోగానికి వెళ్లారు. బురఖా వేసుకోవడడం డాక్టర్ చుంక్ జూకు నచ్చలేదు. బురఖా లేకుండా ఉద్యోగానికి రావాలని, లేదంటే స్కార్ప్ వేసుకోవాలని చెప్పాడు. బురఖా వేసుకుంటే నీవు ఉద్యోగానికి రావద్దని గట్టిగా చెప్పాడు.
మత సాంప్రదాయాలను వదులుకునే ప్రసక్తే లేదని, కావాలంటే తాను ఉద్యోగం వదులుకుంటానని నజఫ్ ఖాన్ డాక్టర్ కు చెప్పారు. అల్లా అన్నందుకు విమానంలో నుంచి ఓ ముస్లీం జంటను కిందకు దింపేసిన సంఘటన మరువక ముందే ఇప్పుడు ఈ విషయం వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications