• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అల్లరి పిడుగు: పోప్‌తోనే గేమ్స్ ఆడిన ఈ చిన్నారి వీడియో వైరల్ అవుతోంది

|

సాధారణంగా మతపెద్దలు లేదా మత ప్రవక్తలు సీరియస్‌గా ఒక వేదికపై ప్రసంగిస్తుండగా చిన్న డిస్టర్బెన్స్ అయితే సహించలేరు. కొన్ని సార్లు నిర్వాహకులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తుంటారు. మరికొన్ని చోట్ల ఎవరైనా అడ్డు తగిలితే వారిని మందలిస్తుంటారు. అది చిన్నపిల్లలైనా కానివ్వండి..పెద్ద పిల్లలైనా కానివ్వండి. అదే ప్రపంచ ప్రఖ్యాత గాంచిన పోప్‌ ప్రసంగం అప్పుడు అడ్డుపడితే పరిస్థితి ఎలాగుంటుంది..? ఆయన ఇంకెత్త శివాలెత్తి పోయిండాలి...

వాటికన్ సిటీలో ఓ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు పోప్ ఫ్రాన్సిస్ వేదికపై ఆశీనులై ఉన్నారు. సమావేశానికి చాలామంది హాజరయ్యారు. సరిగ్గా వేదికపైకి ఓ ఐదేళ్ల బాలుడు వచ్చాడు. అప్పటి వరకు తల్లి ఒడిలో ఉన్న బాలుడు ఒక్కసారిగా తల్లి చేతుల నుంచి విడిపించుకుని ఏకంగా వేదికపైకి వచ్చాడు. నేరుగా పోప్ వెనక కాపలాగా నిల్చున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి అతన్ని నిమిరి చూశాడు. అనంతరం పోప్ దగ్గరకు వెళ్లాడు. ఆలోపు తల్లి వేదికపైకి వచ్చి బాలుడిని తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ నేను రానంటే రాను అని చెప్పి మళ్లీ వేదికపై కలియతిరిగాడు. పోప్ ఆనందంతో పిల్లాడిని అలానే చూస్తుండిపోయారు. పిల్లాడి తల్లి క్షమించాల్సిందిగా పోప్‌ను కోరింది. అంతేకాదు పిల్లాడు మాట్లాడలేడని... మూగవాడని తల్లి చెప్పింది. అయితే తన ప్రసంగంలో పోప్ చెబుతూ పిల్లాడు మూగవాడైనప్పటికీ తన భావాల ద్వారా మాట్లాడుతున్నాడని చెప్పారు.

Mute boy climbs on stage of Pope Francis and plays around; leaves pontiff delighted

అబ్బాయి ఇంత స్వేచ్ఛగా తిరుగుతుంటే తన తల్లి ఆ బుడ్డోడిని క్రమశిక్షణలో ఉంచేందుకు ప్రయత్నించగా... పోప్ వారించారు. అబ్బాయిని వదిలేయాల్సిందిగా చెప్పడంతో తల్లి బాలుడిని వేదికపైనే వదిలి కిందకు దిగింది. దీంతో బాలుడు మళ్లీ వేదికపై తన ఆటలను కొనసాగించాడు. ఆ బాలుడికి మాటలు ఇవ్వాల్సిందిగా అంతా ప్రార్థన చేద్దామని పోప్ చెప్పడంతో అక్కడికి వచ్చిన ఏడువేల మంది ప్రార్థనలో ఏకీభవించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
It's not always that we see a religious leader amid an ambience of smile and lightness for the occasions they are identified with are solemn mostly. But when a child interrupts, even the religious leader can't help to keep away the delight.Something similar happened recently when Pope Francis was attending an audience in Vatican on Wednesday, November 28. A five-year-old Argentinian kid got rid of his mother's clutches and climbed the stage on which the pontiff was seated to play around.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more