భార్యను వదిలేయలేదని..: ప్రియుడి అంగాన్ని కట్ చేసింది!(వీడియో)
బీజింగ్: తూర్పు చైనాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను మాత్రమే ప్రేమించాలని, తనతోనే శరీరాక సంబంధం కలిగి ఉండాలనే ఓ యువతి.. కట్టుకున్న భార్యను వదిలేయలేదనే కోపంతో ప్రియుడి అంగాన్ని కత్తిరించేసింది. తీవ్రగాయాలపాలైన బాధితుడు ఆస్పత్రి పాలవగా, ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతోనే ఆ యువతి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లియు (50) అనే ఆ వ్యక్తి ఓ హోటల్ రూం బుక్ చేసుకుని, అక్కడ ఎప్పటిలాగే తన ప్రియురాలితో కలిసి ఉన్నాడు. వారిద్దరికీ గత పదేళ్ల నుంచి పరిచయం ఉంది.
కాగా, అలసిపోయినట్లుగా కనిపించిన లియుకు ఓ మందు బిల్ల ఇచ్చింది అతడి ప్రియురాలు. దీంతో అతడు నిద్రలోకి జారుకున్నాడు. ఒక్కసారిగా తీవ్ర నొప్పిరావడంతో లేచి చూశాడు. అతని మర్మాంగం కత్తిరించబడి ఉంది.

భయాందోళనకు గురైన అతడు అరుపులు, కేకలు వేసుకుంటూ హోటల్ బయటికి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత హోటల్ నుంచి నిందితురాలు కూడా కత్తెరను తీసుకుని వెళ్లిపోయింది.
హోటల్ సిబ్బంది వారి గదిలోకి వెళ్లి చూడగా మొత్తం రక్తం మరకలు ఉన్నాయి. కాగా, రక్తం కారుతుండగా వెళ్లిన బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే అతని మర్మాంగం లభించలేదు.
ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు, బాధితుడు మర్మంగాన్ని కత్తిరించిన నిందితురాలి కోసం గాలింపు చేట్టారు. నిందితురాలి పేరు జంగ్‌గా గుర్తించారు. ఆమెకు వివాహమైనట్లు, ఒక సంతానం కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications