రోహింగ్యా ముస్లింలకు శుభవార్త! దేశంలోకి తిరిగి రావచ్చన్న ఆంగ్ సాన్ సూకీ

బర్మా: మయన్మార్ సంక్లిష్టమైన దేశమని ఆంగ్ సాన్ సూకీ అన్నారు. ఇవాళ దేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. రోహింగ్యాల సంక్షోభంపై అంతర్జాతీయ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఇవాళ కీలక ప్రకటన చేశారు. అతి తక్కువ సమయంలోనే అన్ని సవాళ్ల నుంచి దేశం బయటపడాలని ప్రజలు భావిస్తున్నారన్నారు.

దాదాపు 70 ఏళ్ల అంతర్గత పోరాటం తర్వాత మయన్మార్ లో శాంతి, సుస్థిరత ఏర్పడ్డాయన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనలను ఖండిస్తున్నట్లు ఆమె చెప్పారు. శాంతికి కట్టుబడి ఉన్నామన్నారు. చట్టాన్ని అమలు చేస్తామని సూకీ తెలిపారు. అంతర్జాతీయ జోక్యం పట్ల మయన్మార్ భయపడడం లేదన్నారు.

రోహింగ్యా ల సమస్య పరిష్కారానికి కృషి...

రాఖైన్ రాష్ట్రాన్ని పీడిస్తున్న రోహింగ్యా సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఆ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న అన్ని వర్గాల ప్రజల పట్ల తాను సానుభూతి ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న ముస్లింలు బంగ్లాదేశ్‌కు పారిపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివెళుతున్నారు, ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. రాఖైన్ రాష్ట్రంలో శాంతి స్థాపన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె అన్నారు. చాలా వరకు ముస్లింలు ఆ రాష్ట్రంలోనే ఉండిపోయారని, అందరూ వెళ్లిపోలేదు అని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ దేశాలు వచ్చి రాఖైన్ రాష్ట్రాన్ని సందర్శించాలని సూకీ కోరారు.

కోఫీ అన్నన్ నేతృత్వంలో కమిషన్...

ముస్లింల సమస్యలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్నాయని, అందరి వాదనలు విన్న తర్వాత బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అంగ్ సాన్ సూకీ చెప్పారు. రాఖైన్ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు డాక్టర్ కోఫీ అన్నన్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. తిరిగి దేశంలోకి రావాలనుకున్నవాళ్లకు శరణార్థులు స్టేటస్ కల్పించేందుకు మయన్మార్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మత విశ్వాసాలు, వర్గ విభేదాల ఆధారంగా దేశాన్ని విభజించలేమన్నారు. ఆగస్టు 25న పోలీస్ ఔట్‌పోస్టులపై దాడి జరిగిందని, ఆర్కానా రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీని ఉగ్ర సంస్థగా ప్రకటించినట్లు సూకీ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+