బీచ్ ఒడ్డున వింత జీవి కళేబరం... ఏమై ఉంటుంది... జుట్టు పీక్కుంటున్న నెటిజన్స్...
బ్రిటన్‌లోని లివర్‌పూల్ పట్టణంలో ఉన్న మెర్సీసైడ్ బీచ్‌కి కొట్టుకొచ్చిన 15 అడుగుల ఓ వింత జీవి కళేబరం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కనీసం దాని తల,తోకను కూడా గుర్తుపట్టరాకుండా ఉండటంతో చాలామంది ఇదేంటని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. స్థానికులు కొందరు దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజెన్స్ కూడా దీన్ని గుర్తించేందుకు జుట్టు పీక్కుంటున్నారు.
'అది నాలుగు మొప్పలను కలిగి.. చూసేందుకు చాలా విచిత్రంగా కనిపిస్తోంది. 15 అడుగుల పొడవుతో దాదాపు శరీరంపై ప్రతీచోటా ఎముకలు అతుక్కుని ఉన్నట్లుగా కనిపిస్తోంది. కొన్ని ఎముకలు నాలుగడుగుల పొడవు వరకు ఉన్నాయి.' అని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ఆ జీవిని చూస్తుంటే... దాని శరీరానికి అదనంగా ఇంకేదో అతుక్కుని ఉన్నట్లుగా కనిపిస్తోందని.. బహుశా అది ప్రసవిస్తూనే మరణించి ఉండవచ్చునని పేర్కొన్నాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. అది షార్క్ అయి ఉండవచ్చునని కొందరు,నీటి గుర్రం అయి ఉంటుందేమోనని మరికొందరు... దాన్ని చూస్తుంటే తిమింగలం దవడ ఎముకలా ఉందని ఇంకొందరు... ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నెటిజెన్స్ అది ఆవు లేదా గుర్రమై ఉండాలి... లేదా గ్రహాంతర జీవి కావచ్చునమో అని అభిప్రాయపడుతుండటం గమనార్హం.

Recommended Video
బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఆ జీవి నుంచి విపరీతమైన దుర్గంధం వస్తోందని... దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 32 ఏళ్ల మహిళ ఒకరు పేర్కొన్నారు. ఆ వాసన కారణంగా తాను అనారోగ్యం పాలైనట్లు చెప్పారు. 'అది ఘోరంగా కుళ్లిపోయింది. దాని శరీరంపై మూడు పెద్ద మట్టిదిబ్బలు ఉన్నట్లుగా ఆకారం ఉంది. చూసేందుకు అవి విచిత్రంగా ఉన్నాయి. చాలాచోట్ల మొప్పలు కనిపిస్తున్నాయి.' అని తెలిపారు. దీని గురించి తెలిసి ఓ అధికారి వచ్చి పరిశీలించారని... కానీ ఆయన దాన్ని గుర్తించలేకపోయారని చెప్పారు. ఆ తర్వాత మెరైన్ బయోలాజిస్టులను సంప్రదించామని... త్వరలోనే వారు దీన్ని పరిశీలించబోతున్నారని చెప్పారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications