మునుపెన్నడూ చూడని భారీ వింత ఆకారం: ఏమై ఉంటుంది?
మునుపెన్నడూ చూడని ఓ భారీ భయంకర ఆకారం మురవాయి బీచ్‌కు కొట్టుకువచ్చింది.
న్యూజిలాండ్: చనిపోయిన తిమింగలమా?.. చర్మం తీసి వదిలేసిన సొర చేపా? లేక ఏళ్లుగా సముద్రపు నీటిలో నాని ఒడ్డుకు కొట్టుకువచ్చిన భారీ చెట్టు అయి ఉండవచ్చా?.. న్యూజిలాండ్ లోని మురవాయి తీరానికి కొట్టుకువచ్చిన ఓ వింత ఆకారాన్ని చూసి అక్కడి జనం అనుకుంటున్న మాటలివి.
మునుపెన్నడూ చూడని ఓ భారీ ఆకారం మురవాయి బీచ్‌కు కొట్టుకువచ్చింది. దగ్గరికెళ్లి పరిశీలిద్దామంటే.. ఒక్కసారిగా అది మీద పడి దాడి చేస్తే ఎలా? అన్న భయంతో ఎవరూ దగ్గరికెళ్లడానికి కూడా ధైర్యం చేయడం లేదు. బీచ్‌కు వెళ్లినవారు ఆ భారీ ఆకారాన్ని ఫోటోలు తీసి
సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం న్యూజిలాండ్ అంతటా ఈ భారీ ఆకారం గురించే చర్చ జరుగుతోంది.

అయితే కొంతమంది పరిశీలకులు మాత్రం ఇది ఓ చెట్టు మొద్దుగా చెబుతున్నారు. ఏళ్లుగా సముద్రపు నీటిలో నానిపోయిన దీనిపై సముద్ర జలచరాలు ఉన్నాయని అంటున్నారు. ఇలాంటి జలచరాలు సముద్రంలో పయనించే పడవల అంచున కూడా చేరుతాయనేది పరిశోధకుల వాదన. కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం ఈ వాదనను తప్పుబడుతున్నారు.
మరికొంతమంది ఇంకో అడుగు ముందుకేసి వేరే గ్రహం నుంచి వచ్చిన ఆకారమై ఉండవచ్చునని అభిప్రాయపడుతుండటం గమనార్హం. ఇప్పటికైతే ఈ ఆకారం ఏదైనా జంతువుకు సంబంధించిందా? లేక ఏదైనా శిథిల వస్తువా? అన్నదానిపై స్పష్టత రాలేదు.












Click it and Unblock the Notifications