నగ్నంగా ఇంటర్వ్యూ,: నేకెడ్ అట్రాక్షన్ రెండో సిరిస్ ను ప్రారంభించిన ఛానెల్ 4
ప్రఖ్యాత బ్రిటీష్ టివి ఛానెల్ 4 లో వికృత కార్యక్రమం మరోసారి ప్రారంభమైంది. ఇప్పటివరకు ప్రసారమైన వాటిలో అత్యంత చెత్త కార్యక్రమంగా విమర్శలపాలైన నేకెడ్ అట్రాక్షన్ రెండో సిరీస్ ను ఆ ఛానెల్ గురువారంనాడు ప
లండన్: ప్రఖ్యాత బ్రిటీష్ టివి ఛానెల్ 4 లో వికృత కార్యక్రమం మరోసారి ప్రారంభమైంది. ఇప్పటివరకు ప్రసారమైన వాటిలో అత్యంత చెత్త కార్యక్రమంగా విమర్శలపాలైన నేకెడ్ అట్రాక్షన్ రెండో సిరీస్ ను ఆ ఛానెల్ గురువారంనాడు ప్రారంభించింది.
డేటింగ్ షో గా అభివర్ణించే ఈ కార్యక్రమంలో పోటీదారులను స్టేజ్ పై నగ్నంగా నిలబెట్టించి పలురకాల ప్రశ్నలు వేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ తర్వాత జంట డేటింగ్ చేయడం వారి అనుభవాలు, వివరణ తంతను ఎపిసోడ్లుగా విభజించి ప్రసారం చేస్తారు.

ఛానెల్ 4 లో గత ఏడాది జూలై 25న, నేకెడ్ ఎట్రాక్షన్ మొదటి సిరీష్ ప్రారంభమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
అయితే ఇండిపెండెంట్ బ్రాడ్ కాస్టింగ్ ఆధారిటీ కలిగి ఉన్నందున టీవి ప్రాసారాల నిలిపివేత సాధ్యం కాలేదు. ఆ విధంగా ఛానెల్ 4 తన హక్కులను మరోసారి దుర్వినియోగం చేస్తూ వికృత ప్రసారాలను పున: ప్రారంభించింది.
జర్నలిస్ట్, రచయిత్రి అన్నా రిచర్డ్ సన్ ఈ ప్రోగ్రామ్ ను హోస్ట్ చేస్తున్నారు. గతంలో ఘాటుగా స్పందించిన నెటిజన్లు ఈ డేటింగ్ షో రెండో సిరిస్ పై భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications