అంతరిక్షంలో బట్టలు ఎలా మార్చుకుంటారు..? ఆస్ట్రోనాట్ వీడియో చూస్తే..
అంతరిక్షంలో జీరో గ్రావిటీ ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి ఉండదు. అందువల్ల ఏ పని చేయాలన్నా వ్యోమగాములకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. మనం సాధారణంగా బట్టలు మార్చుకుంటాం. కానీ స్పేస్ లో బట్టలు మార్చుకోవడం ఎలాగో వివరించారు నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ రీసెర్చ్(NASA) కు చెందిన కెమికల్ ఇంజినీర్, సైంటిస్ట్ పెటిట్.

తన ప్యాంట్ ను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో పెట్టాడు. అయితే మనం ఒక కాలుని ప్యాంట్ లో పెట్టి.. మరో కాలు భూమిపై సపోర్ట్ చేస్తాం. కానీ స్పేస్ లో అలా కాదు.. సెంటిస్ట్ పెటిట్.. తన రెండు కాళ్లను ఒకే సారి ప్యాంట్ లోకి దూర్చి వేసుకున్నాడు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది.. కాబట్టి ఇలానే బట్టలు మార్చుకోవాలని.. రెండు చేతులు, రెండు కాళ్లు ఇలా ఒకేసారి దూర్చాలని ఆయన వివరించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై టూ లెగ్స్ ఎట్ ఏ టైమ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు పెటిట్. ప్రస్తుతం ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇది నాకు కావాల్సిన రియల్ కంటెంట్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Two legs at a time! pic.twitter.com/EHDOkIBigA
— Don Pettit (@astro_Pettit) February 21, 2025
డాన్ పెటిట్ ఎవరు..?
డాన్ పెటిట్.. అమెరికాకు చెందిన ఆస్ట్రోనాట్. కెమికల్ ఇంజినీర్, ఇన్వెంటర్. ఆయన నాసాలో పనిచేస్తున్నారు. పెటిట్ అరిజోనా యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ లో పీజీ పట్టా పొందారు. 2002లో ఐఎస్ఎస్ పరిశోధనలో భాగంగా ఆయన స్పేస్ లోకి వెళ్లారు. ఐదు నెలల పరిశోధన అనంతరం తిరిగి వచ్చారు. మళ్లీ 2008, 2011లో వివిధ మిషన్స్ లో భాగంగా వెళ్లారు.












Click it and Unblock the Notifications