వీసాకు మోడీ దరఖాస్తు చేసుకోవచ్చు: అమెరికా
న్యూఢిల్లీ: 2014లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల ముందు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అగ్రరాజ్యం నుంచి ఓ శుభవార్త అందింది. అదేంటంటే గత కొంతకాలంగా నరేంద్ర మోడీకి వీసా నిరాకరిస్తూ వచ్చిన అగ్రరాజ్యం అమెరికా తన వైఖరిని మార్చుకుని వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని బుధవారం ఓ సందేశాన్ని ఇచ్చింది.
భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కోసం తమ దేశ వీసా పాలసీని మార్చుకోలేదని అమెరికాకు చెందిన సంబంధిత అధికారులు చెప్పారు. వివరాల సమీక్ష కోసం కొంత కాలంపాటు ఆయన వేచి చూడాల్సి ఉంటుందని అన్నారు. బుధవారం మీడియాతో సమావేశమైన అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ మాట్లాడుతూ.. తాము దీర్ఘ కాలంగా కొనసాగిస్తున్న వీసా పాలసీలో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపారు.

అయితే బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, సాధారణ దరఖాస్తుదారులానే అతను కూడా తాము సమీక్షించే వరకు వేచి చూడాల్సి ఉంటుందని హార్ఫ్ తెలిపారు. ఒక వేళ నరేంద్ర మోడీ ఇప్పటికే వీసా కోసం దరఖాస్తు చేసివుంటే? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. వీసా దరఖాస్తు వివరాలు చాలా గోప్యంగా ఉంటాయని, వాటి గురించి తనకు సమాచారం లేదని అన్నారు. అయితే తాను పరిశీలిస్తానని తెలిపారు.
కాగా 2005లో మోడీకి దౌత్య వీసా జారీ చేసేందుకు అమెరికా నిరాకరించింది. మత స్వేచ్ఛకు ఆయన విఘాతం కలిగించిన కారణంగా ఆయన వీసా నిరాకరిస్తున్నట్లు అమెరికా తెలిపింది. అమెరికా తమ న్యాయసూత్రాలను అనుసరించి మోడీకి వీసా ఇవ్వడం లేదని ఆ సమయంలో అధికారులు తెలిపారు.
-
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications