భూమిని కాపాడతారా? నాసాలో ఉద్యోగం.. ఏడాదికి కోటి జీతం!
అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా గ్రహాంతర జీవుల నుంచి భూమిని కాపాడే వారి కోసం చూస్తోంది. దీనికోసం నాసా ఓ కొత్త ఉద్యోగాన్ని సృష్టించింది. ఈ ఉద్యోగం పేరు.. ప్లానెటరీ ప్రొటెక్షన్ ఆఫీసర్.
హూస్టన్: అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా గ్రహాంతర జీవుల నుంచి భూమిని కాపాడే వారి కోసం చూస్తోంది. దీనికోసం నాసా ఓ కొత్త ఉద్యోగాన్ని సృష్టించింది. ఈ ఉద్యోగం పేరు.. ప్లానెటరీ ప్రొటెక్షన్ ఆఫీసర్. ఈ మేరకు నాసా ఒక ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.
గ్రహాంతర జీవుల నుంచి భూమిని, మనుషులను కాపాడటమే ప్లానెటరీ ప్రొటెక్షన్ ఆఫీసర్ చేయాల్సిన పని. దీని కోసం ఏడాదికి లక్షా 87 వేల డాలర్లు (సుమారు రూ.కోటి 19 లక్షలు) చెల్లిస్తామని ప్రకటించింది. దీనికి అదనంగా అలవెన్సులు కూడా ఉంటాయి.

భూమిని రక్షించడానికి నాసా కొన్ని విధానాలను పాటిస్తున్నదని ఈ సందర్భంగా ఆ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. మూడేళ్ల కాలానికిగాను ఈ జాబ్ ఉంటుంది. దీనిని ఐదేళ్లకు కూడా పొడిగించవచ్చు.
ఇతర గ్రహాలపైకి అధ్యయనం కోసం వెళ్లినపుడు అక్కడి నుంచి పరిశోధనల కోసం తెచ్చే పదార్థాల వల్ల భూవాతావరణానికి, భూమికి ఎలాంటి హాని కలుగకుండా చూడాల్సిన బాధ్యతలో భాగంగా నాసా ఈ కొత్త ఉద్యోగాన్ని సృష్టించింది.
1967లో ఔటర్ స్పేస్ ఒప్పందాన్ని నాసా కుదుర్చుకుంది. దీని ప్రకారం వేరే గ్రహాలకు వెళ్లే స్పేస్‌క్రాఫ్ట్స్ అక్కడి ఏలియన్ ప్రపంచాన్ని కలుషితం చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
అలాగే ఇతర గ్రహాల నుంచి తెచ్చే పదార్థాల ద్వారా భూమికి హాని కలుగకుండా చూసేందుకు ఈ కొత్త ఉద్యోగిని నియమిస్తున్నారు. ఇప్పటికే మార్స్ (అరుణ గ్రహం)పై ఉన్న నీటి కారణంగా అక్కడ జీవం ఉండే అవకాశం ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు.
వాటి వల్ల భూమికి ఎలాంటి హాని జరగకుండా ప్లానెటరీ ప్రొటెక్షన్ ఆఫీసర్ చూడాల్సి ఉంటుంది. గురు గ్రహం చంద్రుడు యురోపాపైకి నాసా కొత్తగా స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపనున్న నేపథ్యంలో ఈ కొత్త ఉద్యోగి కోసం ఈ స్పేస్ ఏజెన్సీ చూస్తున్నది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications