11 ఏళ్ల భారత విద్యార్థిని ప్రేరణ ప్రయోగాలు రోదసీలోకి!

NASA to launch experiments of Indian student into space
దుబాయ్: భారత్‌కు చెందిన పదకొండు ఏళ్ల చిన్నారి రూపొందించిన రెండు ప్రయోగాలు అంతరిక్షంలోకి వెళ్లనున్నాయి. భారత సంతతి విద్యార్థి ప్రేరణ పాయ్ మేథోశక్తిని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. క్యూబ్స్ ఇన్ స్పేస్ (సీఐఎస్) పేరుతో నాసా చేపట్టిన పరిశోధనలో షార్జాలోని స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న ప్రేరణ ప్రతిపాదనలు రెండు ఉన్నాయి.

ఈ ప్రాజెక్టులో యూఏఈ నుంచి భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక విద్యార్థి ప్రేరణే. ఈ ప్రాజెక్టులో మొత్తం వంద మంది విద్యార్థుల ప్రతిపాదనలను నాసా ఆమోదించింది. వీరిలో 75 మంది అమెరికా విద్యార్థులుండగా, మిగిలిన వారు ఇతర దేశస్థులు. జూన్ 26న నాసా ప్రయోగంలో వీటిని పరీక్షిస్తారు.

గత మే నెలలో చేపట్టిన సిఐఎస్ ప్రోగ్రామ్‌కు ప్రతిపాదనలు పంపాలంటూ 11-14 ఏళ్ల విద్యార్థులను నాసా కోరింది. దీంతో ప్రేరణ రెండు ప్రతిపాదనలు పంపింది. ప్రేరణ పాయ్ షార్జాలోని ఢిల్లీ ప్రయివేటు స్కూల్లో చదువుతోంది.

అంతరిక్ష పీడనంలో వివిధ జిగురు పదార్థాలు ఎలా ప్రభావితమవుతాయో తెలుసుకోవడం ప్రేరణ ప్రతిపాదనల్లో మొదటిది కాగా, మూతులు బిగించిన ప్లాస్టిక్, గాజు బాటిళ్లు అంతరిక్షంలో ఎలాంటి చర్యలకు గురవుతాయో తెలుసుకోవడం రెండోది. తన ప్రతిపాదనలపై నాసా ప్రయోగాలకు సిద్ధం కావడంపై ప్రేరణ సంతోషం వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+