గ్రహాంతరవాసులపై నాసా బయటపెట్టిన 33 పేజీల సంచలన నివేదిక: కీలకాంశాలు
వాషింగ్టన్: అంతు చిక్కని, అంతే లేని ఈ విశ్వంలో గ్రహాంతరవాసులు ఉన్నారా? లేదా? అనే చర్చ ఇప్పటిది కాదు. దశాబ్దాల నుంచీ దీనిపై డిబేట్స్ సాగుతున్నాయి. ఏలియన్లు నిజంగానే ఉన్నాయంటూ మెక్సికో శాస్త్రవేత్తలు సరిగ్గా 24 గంటల కిందటే సాక్ష్యాధారాలతో సహా ఆ దేశ పార్లమెంట్‌లో రుజువు చేశారు.
ఆకాశంలో ఎగిరే అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్‌ను చూశామని, వాటిని కెమెరాల్లో బంధించామంటూ గతంలో చాలామంది ప్రకటించుకున్నారు కూడా. ఇతర గ్రహాల నుంచి కొన్ని వింత వస్తువులు భూ కక్ష్యలో తిరుగాడిన సందర్భాలు ఉన్నాయంటూ గతంలో ఎన్నో వార్తలొచ్చాయి.

వాటన్నింటి మీద అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ..నాసా దశాబ్దాల తరబడి అధ్యయనం చేస్తూ వచ్చింది. తాజాగా ఆ నివేదికలను బయటపెట్టింది. 33 పేజీల రిపోర్ట్ ఇది. యూఎఫ్ఓలు, గ్రహాంతరవాసులపై ఇన్ని సంవత్సరాల తరబడి సాగించిన పరిశోధనలతో కూడిన ఈ నివేదికను నాసా అధినేత బిల్ నెల్సన్ విడుదల చేశారు.
భూమి మీద మనుషులు, ఇతర జీవజాలం ఉన్నట్లే విశ్వంలో ఇతర బుద్ధి జీవులు లేదా గ్రహాంతరవాసులు ఉన్నారని తాము బలంగా విశ్వసిస్తోన్నామని బిల్ నెల్సన్ తేల్చి చెప్పారు. ఏలియన్స్ మనుగడ సాగిస్తున్నాయనే విషయాన్ని తాము నమ్ముతున్నామని పేర్కొన్నారు.

ఈ అనంత విశ్వంలో మనుషులు మాత్రమే జీవిస్తున్నారనే నిర్ధారణకు రాలేకపోతున్నామని బిల్ నెల్సన్ అన్నారు. అలా అనుకుంటే అది అహంకారమే అవుతుందని వ్యాఖ్యానించారు. భూమిపై ఉన్న జీవం.. ఈ విశ్వంలో మనకు తెలిసిన ఏకైక లివింగ్ ఆబ్జెక్ట్ అని, మనం ఒంటరిగా లేమని సూచించడానికి అనేక సాక్ష్యాధారాల ఉన్నాయని పేర్కొన్నారు.
గ్రహాల వాతావరణం, వాటి ఉపరితలాలు, గెలాక్సీ, పాలపుంతకు అవతలి వైపున బుద్ధి జీవుల గురించి అన్వేషించడానికి ఇప్పటికే తాము అనేక రకాల ప్రయత్నాలు మొదలుపెట్టామని, దీనికోసం ప్రత్యేకంగా కొన్ని శాటిలైట్లను సైతం ప్రయోగించినట్లు బిల్ నెల్సన్ గుర్తు చేశారు. మున్ముందు ఈ పరిశోధనల పరిధిని మరింత విస్తృతం చేయదలచుకున్నామని అన్నారు.
నాసా కూడా అన్ ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనామినన్‌పై పరిశోధనలు సాగించడానికి కొత్తగా ఓ విభాగాన్ని సైతం ఏర్పాటు చేశామని వివరించారు. డైరెక్టర్ స్థాయి అధికారి ఈ విభాగానికి సారథ్యాన్ని వహిస్తోన్నట్లు తెలిపారు. దీనితో పాటు ఓ నిపుణుల ప్యానెల్‌ను నియమించామని వివరించారు.

యూఎఫ్ఓల గురించి తమ వద్ద కొన్ని కీలక డాక్యుమెంట్లు, వీడియోలు ఉన్నాయని, వాటిపై ఎటువంటి శాస్త్రీయ ఆధారాలుగా ప్రస్తుతానికి పరిగణించట్లేదని బిల్ నెల్సన్ చెప్పారు. వాటిపై స్థిరమైన, వివరణాత్మక పరిశోధనలు లేకపోవడం వల్ల యూఎఫ్ఓ/యూఏపీల గురించి ఖచ్చితమైన, శాస్త్రీయ నిర్ధారణలకు రాలేకపోతున్నామని అన్నారు.
అమెరికా తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో గగనతలంపై ఏవియేషన్ టెక్నాలజీలను మించిన వేగంతో ప్రయాణించిన కొన్ని యూఎఫ్ఓలను రాడార్‌లు పసిగట్టినట్లు గతంలో పెంటగాన్ విడుదల చేసిన వీడియోలను సైతం తమ పరిశోధనల కోసం పరిగణనలోకి తీసుకున్నామని నాసా చీఫ్ తెలిపారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications