క్యూరియాసిటీ ఫోటో: మార్స్ నుండి నీలిరంగులో సూర్యాస్తమయం
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ కొన్ని ఫోటోలు తీసి పంపించింది. అంగారకుడిపై అస్తమిస్తున్న సూర్యుడిని నాసా మార్స్ రోవర్ కెమెరాలో బంధించి పంపించింది. అది నీలం రంగులో ఉంది.
అంతకుముందే అక్కడ చెలరేగిన ధూళి తుపాన్ కాస్త నెమ్మదించిన తర్వాత తీసిన చిత్రం అది. పసుపు, దానిమ్మ రంగులు కలగలిసినట్లున్న మబ్బుల మధ్య నీలం రంగులో సూర్యుడు ఉన్నాడు. భూమిమీద సూర్యాస్తమయం అంటే పసుపు, ఎరుపు రంగుల మేళవింపులో ఉంటుంది. అది అద్భుతంగా కనిపిస్తుంది.

ఇప్పుడు అంగారకుడి పై నుండి క్యూరియాసిటీ రోవర్ తీసిన సూర్యాస్తమయ వీడియో నీలం రంగులో ఉండటం గమనార్హం. మాస్ట్ కెమెరాను ఉపయోగించి గత వారం కొన్ని చిత్రాలను భూమి మీదకు పంపించింది. వీటిని పరిశీలించిన నాసా, తన వెబ్ సైట్లో వాటిని పెట్టింది.
దీని పైన పరిశోధన చేయనున్నట్లు టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ లెమన్ ప్రకటించారు. అరుణ గ్రహంపై నీలం రంగులో ఉండటానికి గల కారణాల పైన తాము పరిశోధన చేస్తామని వారు చెప్పారు. కాగా, క్యూరియాసిటీ అంతరిక్షానికి సంబంధించిన ఫోటోలు గతంలోను పంపించింది.












Click it and Unblock the Notifications