Mars mission: అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి చేసిన నాసా రోవర్, ఇక వ్యోమగాములకు ఢోకాలేదు

వాషింగ్టన్: అంగారకుడు(Mars)పై నాసా ప్రయోగం మరో అద్భుతం సృష్టించింది. అంగారకుడిపై ఆక్సిజన్ కోసం నాసా ప్రయోగించిన మిషన్‌ విజయవంతమైంది. నాసా అంగారకుడిపైకి పంపిన పర్స్‌వరెన్స్ రోవర్‌లోని పరికరం విజయంతంగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసినట్లు నాసా వెల్లడించింది.

అంగారక గ్రహంపై 2021లో నాసా ప్రయోగించిన రోవర్‌లోని మార్స్ ఆక్సిజన్ ఇన్-ఎస్ఐటీయూ రిసోర్స్ యూటిలైజేషన్ ఎక్స్‌పరిమెంట్(MOXIE) పరికం అంగారకుడిపై ఉన్న కార్బన్ డై ఆక్సైడ్‌ను తీసుకుని 122 గ్రాముల ఆక్సిజన్‌ను విడుదల చేసిందని నాసా పేర్కొంది. అంతేగాక, దీన్ని పరీక్షించగా.. 98 శాతం స్వచ్ఛంగా ఉన్నట్లు తెలిపింది. నాసా నిర్దేశించిన లక్ష్యం కంటే ఇది రెట్టింపు అని తెలిపింది.

Nasa rover produces oxygen on Mars, mission completed

అంగారకుడిపై వాతావరణంలో ఒక్కొక్క కార్బన్ అణువును తీసుకుని ఆక్సిజన్‌ను విజయవంతంగా ఉత్పత్తి చేస్తోందని పేర్కొంది. ఈ పరికరం కార్బన్ డయాక్సైడ్ నుంచి ఆక్సిజన్‌ను వేరు చేసే ప్రక్రియలో కీలక పాత్ర పోషించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో నాసా ఎక్స్ ట్విట్టర్‌లో ఆనందాన్ని పంచుకుంది. దీంతో భవిష్యత్తులో అంగారకుడిపై వెళ్లే వ్యోమగాములకు ఆక్సిజన్ అందించేందుకు మార్గం సులువవుతుందని చెప్పుకొచ్చింది.

కాగా, MOXIE అద్భుతమైన పనితీరు మార్స్ వాతావరణం నుంచి ఆక్సిజన్‌ను వెలికితీసే సాధ్యాసాధ్యాలను ప్రదర్శించింది. భవిష్యత్ వ్యోమగాములకు శాస్వప్రక్రియ గాలి లేదా రాకెట్ ప్రొపెల్లెంట్ ను సరఫరా చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని నాసా డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పామ్ మెల్రాయ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+