నాసా సరికొత్త యాప్: వ్యోమగామిలా గెలాక్సీ ఎదుట మీరు ఇలా సెల్ఫీ తీసుకోవచ్చు!
వాషింగ్టన్: నాసా తాజాగా రెండు యాప్‌లను రూపొందించింది. అందులో ఒకటి సెల్ఫీలు తీసుకునే యాప్. మరొకటి ఎక్సోప్లానెట్ ఎక్స్‌కర్షన్ వీఆర్ యాప్. మొదటి యాప్‌తో నక్షత్ర మండలాలతో సెల్ఫీ తీసుకున్న అనుభూతి పొందవచ్చు. రెండో యాప్‌తో ఐదు గ్రహాలను మనం చుట్టిరావొచ్చు. అక్కడి అద్భుత వెలుగులను, చీకటిలను చూడవచ్చు.
ఆసక్తి కలిగిన వారు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ఓ వ్యోమగామిలా గెలాక్సీ (నక్షత్ర మండలం) బ్యాక్ డ్రాప్‌తో సెల్ఫీ తీసుకోవచ్చు.

నాసా సెల్ఫీ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లు ఉపయోగించి, ఆసక్తి కలిగిన వారు విశ్వంలోని నక్షత్ర మండలం ముందు ఫోటో దిగినట్లుగా ఫోటో తీసుకోవచ్చు. యూజర్లకు ఆసక్తి ఉంటే వాటిని సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా షేర్ కూడా చేసుకోవచ్చు.
వర్చువల్ రియాలిటీ పరిజ్ఞానంతో నాసా దీనిని అభివృద్ధి చేసింది. స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్‌ను ప్రయోగించి శనివారంతో పదిహేనేళ్లు పూర్తవుతుంది. దీంతో ఈ టెలిస్కోప్ తీసిన చిత్రాలతో తాజా యాప్‌ను రూపొందించింది. దీనికి సెల్ఫీస్ యాప్‌గా నామకరణం చేసింది.
దీని సాయంతో సెల్ఫీలు తీసుకొంటే మన వెనుక గెలాక్సీలు కనిపిస్తాయి. ఈ చిత్రాల వెనుక కథలను వివరించడం ఈ యాప్ ప్రత్యేకత. కళ్లను కట్టిపడేసే ముప్పై నక్షత్ర మండలాల చిత్రాలు ఈ యాప్‌లో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో ఇతర టెలిస్కోప్‌లు తీసిన చిత్రాలను వీటికి జత చేయనున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications