అంతరిక్షంలో పూసిన తొలి పుష్పం ఇదే(ఫొటో)
న్యూయార్క్: అంతరిక్షంలో అద్భుతాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. అంతరిక్షంలో తొలిసారి జినియా అనే నారింజ రంగులో అందంగా ఉన్న పుష్పాన్ని సృష్టించారు. ఇది అంతరిక్షంలో పూసిన తొలి పువ్వు కావడం విశేషం. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా ఈ పూలు పూయించారు.
అంతరిక్షంలో పంటలు పండించేందుకు నాసాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జినియా విత్తనాలను నాటారు. వారి ప్రయత్నం ఫలించి తొలిసారిగా అంతరిక్షంలో మొక్క మొలిచింది... అది పెరిగి పుష్పించింది కూడా.

ఈ విషయాన్ని శాస్త్రవేత్త స్కాట్ విల్లీ అంతరిక్షం నుంచి ట్వీట్ చేశారు. అంతరిక్షంలోని హైడ్రోపోనిక్ వెజీ ల్యాబ్‌లో సున్నా గ్రావిటీలో ఈ మొక్కను పెంచారు.
అమెరికాకు చెందిన ఈ జినియా పూలను ఆహారంగా తీసుకునే సలాడ్‌లలో ఉపయోగిస్తారు. ఈ పువ్వు పూయడంతో మరిన్ని కూరగాయల మొక్కలు నాటేందుకు అవకాశం దొరికినట్లయిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
First ever flower grown in space makes its debut! #SpaceFlower #zinnia #YearInSpace pic.twitter.com/2uGYvwtLKr
— Scott Kelly (@StationCDRKelly) January 16, 2016 











Click it and Unblock the Notifications