అమెరికాలో అల్లకల్లోలం, ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్, హరికేన్ తీరం దాటినా...

హరికేన్లు హార్వే, ఇర్మా దెబ్బ నుంచి కోలుకోకముందే నేట్‌ హరికేన్‌ అమెరికాలో బీభత్సం సృష్టిస్తోంది. బిలోక్సీ, మిసిసిపీ ప్రాంతాల్లో శనివారం తీరం దాటినప్పటికీ ఆదివారం భారీ వర్షం కురిసింది.

న్యూఓర్లాన్స్‌: హరికేన్లు హార్వే, ఇర్మా దెబ్బ నుంచి కోలుకోకముందే నేట్‌ హరికేన్‌ అమెరికాలో బీభత్సం సృష్టిస్తోంది. బిలోక్సీ, మిసిసిపీ ప్రాంతాల్లో శనివారం తీరం దాటినప్పటికీ ఆదివారం భారీ వర్షం కురిసింది.

ఈ హరికేన్ కారణంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. జనజీవనం స్తంభించింది. అలబామా, ఫ్లోరిడా, లూసియానా, మిసిసిపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిలుపునిచ్చారు.

Nate weakens but rain and floods continue on US Gulf Coast

లూసియానా, మిసిసిపీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారి కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. తుఫాను ప్రభావంపై మిసిసిప్పీ గవర్నర్ ఫిల్ బ్రయాంట్‌తో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడారు.

2005లో వచ్చిన కత్రినా తుఫాను అనంతరం మిసిసిప్పీలో ఈ స్థాయిలో తుఫాను రావడం ఇదే. నేట్ తుఫాను ప్రభావం వల్ల దాదాపు 67 వేల గృహాలు చీకటి కోరల్లో చిక్కుకున్నాయి. విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఆదివారం ఇది మరింత బలహీనపడి అమెరికా దక్షిణాదిలోని గల్ఫ్‌ తీరాన్ని తాకింది. హరికేన్ తీరం దాటినప్పటికీ ఉత్తర జార్జియా, అలబామా, ఫ్లోరిడా పన్‌హాండ్లే ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని మియామిలోని నేషనల్ హరికేన్ సెంటర్ అధికారులు అంచనా వేస్తున్నారు. హరికేన్ మరింత బలహీనపడనున్న నేపథ్యంలో న్యూఆర్లియాన్స్‌లో ముందు జాగ్రత్తగా విధించిన కర్ఫ్యూను ఎత్తివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+