Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సింహాన్ని దగ్గరగా చూడు తప్పు లేదు: గేమ్స్ ఆడితే..

లాహోర్: కొన్ని కొన్ని సంఘటనలు, చిత్రాలు, జీవితాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఒక ఫోటో గ్రాఫర్ తాను ఏదో ఒక అద్బుతమైన ఫోటో తీసి అందరినీ అశ్చర్యానికి గురి చెయ్యాలని భావించాడు. సమయంలో కోసం ఎదురు చూశాడు. ఆ సమయం రానే వచ్చింది. ప్రాణాలకు తెగించి అనుకున్నది సాధించాడు.

పాకిస్థాన్ లోని లాహోర్ లో అతీఫ్ సయిూద్ (38)అనే ఫోటో గ్రాఫర్ ఉన్నాడు. ఇతను ఇప్పటి వరకు ఎన్నో అద్బుతమైన ఫోటోలు తీశాడు. పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు. అయితే అతనికి తృప్తి కలగలేదు. ఇంకా ఏదైనా సాధించాలని తహతహలాడాడు.

ఓ రోజు కారులో పాకిస్థాన్ లోని లాహోర్ సఫారి పార్క్ లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న జంతువులను ఫోటోలు తీస్తు వెళ్లాడు. అప్పుడే అతని కంటికి ఒక మృగరాజు కనిపించింది. ఆ మృగరాజును చాలా అందంగా ఫోటో తీసి తన కెమెరాలో బంధించాలని భావించాడు. కారులో నుండి ఫోటో తియ్యాలని అనుకున్నాడు.

 a nature photographer in Pakistan, just had a close encounter with a lion

అయితే ఆ సమయంలో సఫారి పార్క్ లో వాతవరణం చాలా అందంగా ఉండటంతో మృగరాజును చాలా దగ్గర నుండి ఫోటో తియ్యాలని అనుకున్నాడు. వెంటనే కారు దిగి గడ్డిలో పాకుకుంటూ చప్పుడు కాకుండా అనుకున్న చోటికివెళ్లాడు. అక్కడి నుండి మృగరాజు ఇంకా చాలా అందంగా కనిపించింది.

వెంటనే ఫోటో తీశాడు. రెండో సారి ఫోటో తీసే సమయంలో ఒక్క సారిగా క్లిక్ సౌండ్ వచ్చింది. అంతే ఆ సౌండ్ చెవిలో పడటంతో మృగరాజుకు కోపం వచ్చింది. నాతోనే గేమ్స్ ఆడుతావా అంటూ వెంటపడింది. ఆతీఫ్ ప్రాణాలు అరచేతిలో పట్టకుని కారు దగ్గరకు పరుగు తీశాడు.

అప్పటికే కారు డోర్ తీసి పెట్టి ఉండటంతో టక్కున లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నాడు. మృగరాజు కారు మీద రెండు పంజాలు విసిరి నీ టైం బాగుంది, బ్రతికిపో అంటు వార్నింగ్ ఇచ్చి తన పాటికి తను వెళ్లి పోయింది. ఆతీఫ్ ఇంటికి చేరుకుని హమ్మయ్యా అనుకున్నాడు. అతను తీసిన ఫోటో మాత్రం అందరిని ఆకట్టుకునింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+