ప్రకృతి మహాద్భుతం.. ఇసుక నది!: వీడియో హల్‌చల్
బాగ్ధాద్: ఇరాక్‌లో ప్రకృతి మహాద్బుతం! ప్రకృతిలో మనం అప్పుడప్పుడు అద్భుతాలు చూస్తుంటాం. అప్పుడప్పుడు మహాద్భుతాలు చూస్తుంటాం. అలాంటి మహాద్భుతమే ఇరాక్‌లో కనువింది చేస్తోంది.
ఇసుక నదీ ప్రవాహం ఓ అద్భుతమే! ఓ వ్యక్తి దీనిని వీడియో తీశాడు. ఇప్పుడు ఇది ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. ఇరాక్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇది సంభవించి ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు.ఘనీభవించిన నది నీళ్లు ఉబికి వచ్చి ఇలా కనిపిస్తోంది. దీనిని ఇసుక నది అని అంటున్నారు.

గత కొద్ది వారాలుగా ఇరాక్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలువురు మృతి చెందారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఇరాక్‌తో పాటు ఈజిప్ట్, ఇజ్రాయెల్, జోర్డాన్, సౌదీ అరేబియా తదితర చోట్ల భారీ వర్షాలు కురిశాయి.












Click it and Unblock the Notifications